Namitha: ట్రోలర్స్‌కు నమిత స్ట్రాంగ్ వార్నింగ్! అసలేమైందంటే..?

నటి నమిత సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దారుణమైన ట్రోల్స్‌పై ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంపై అత్యంత అసభ్యకరమైన కామెంట్స్ రావడం తీవ్రంగా బాధించిందని చెప్పారు. బిగ్‌బాస్‌పై కూడా స్పందిస్తూ, టీవీ ఎపిసోడ్ ఆధారంగా వ్యక్తులను జడ్జ్ చేయడం సరికాదని అన్నారు.

New Update
Namitha

Namitha

Namitha: ఒకప్పటి స్టార్ హీరోయిన్ నమిత సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దారుణమైన ట్రోలింగ్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, నెటిజన్లు పెట్టిన అసభ్యకరమైన కామెంట్లు తనను మానసికంగా చాలా బాధపెట్టాయని చెప్పారు.

నమిత మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు “నీ అమ్మ క్యాన్సర్‌తో చనిపోవాలి”, “నీ పిల్లలు, నువ్వు పెంచుకునే పెంపుడు జంతువులు కూడా చనిపోవాలి” వంటి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఇలాంటి మాటలు మొదటిసారి చదివినప్పుడు తాను చాలా షాక్ అయ్యానని, రోజులు తరబడి ఏడ్చానని ఎమోషనల్ గా చెప్పారు.

సినిమాల్లో స్టార్ హీరోలతో నటించి గుర్తింపు తెచ్చుకున్న నమిత, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలు చేశారు. తెలుగులో ‘సొంతం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రభాస్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కూడా నటించారు. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి, ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.

బిగ్‌బాస్ షోపై కూడా స్పందించిన నమిత, టీవీలో చూపించే చిన్న ఎపిసోడ్ ఆధారంగా కంటెస్టెంట్స్‌ను తీర్పు ఇవ్వడం సరికాదని అన్నారు. 24 గంటల రియాలిటీని కేవలం 90 నిమిషాల కంటెంట్‌తో జడ్జ్ చేయడం తప్పు అని ఆమె అభిప్రాయపడ్డారు.

తన గురించి వచ్చే ట్రోల్స్‌ను తాను భరించగలనని, కానీ తన కుటుంబ సభ్యులు, పిల్లలు, స్నేహితులపై వస్తే మాత్రం ఊరుకోనని గట్టి వార్నింగ్ ఇచ్చారు.

సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై పెరుగుతున్న సైబర్ బులీయింగ్‌పై నమిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు