/rtv/media/media_files/2026/05/22/nagabandham-2026-05-22-12-16-42.jpg)
Nagabandham
Nagabandham: నాగబంధం సినిమాతో యువ హీరో విరాట్ కర్ణ Virat Karrna ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడు అభిషేక్ నామా Abhishek Nama తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం జూలై 3న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, రెండు పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి.
తాజాగా మూవీ టీమ్ మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో విరాట్ కర్ణ ఓ భారీ నాగుతో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. వర్షంలో నిలబడి, చేతికి పెద్ద కోబ్రా చుట్టుకుని, చేతిలో భారీ కత్తితో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన లుక్ కనిపిస్తోంది. ఒకవైపు మంటలు ఎగిసిపడుతున్న యుద్ధ వాతావరణం, మరోవైపు సముద్ర అలలు పోస్టర్‌కు మరింత పవర్‌ఫుల్ ఫీల్ తీసుకొచ్చాయి.
The most awiated Pan-Indian Visual Spectacle #NAGABANDHAM's VFX works are in full flow 🔥🔥🔥#NagabandhamOnJuly3rdpic.twitter.com/noZKkaXEQB
— Indian Clicks (@IndianClicks) May 21, 2026
సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోల్లో కనిపించిన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా CG, VFX పనులను దేశంలోని ప్రముఖ స్టూడియోలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. థియేటర్లలో అద్భుతమైన విజువల్ అనుభూతి ఇవ్వాలని మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఈ చిత్రాన్ని NIK Studios భారీ స్థాయిలో నిర్మిస్తోంది. పురాణ కథలు, చారిత్రక అంశాలను కలిపి కొత్త తరహా కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
హిందీ ప్రేక్షకుల కోసం Zee Studios ఈ సినిమాను సమర్పిస్తోంది. నార్త్ లో కూడా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ‘నాగబంధం’ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచుతోంది.
Follow Us