/rtv/media/media_files/2025/03/24/p9fFIYVuaaCvmPtXasA5.jpg)
Naga Chaitanya NC24
Naga Chaitanya: చందు మొండేటి(Chandu Mondeti) నాగ చైతన్య కాంబోలో తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’తో ఫుల్ జోష్ లో మూవీస్ చేస్తున్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం ఒక కొత్త చిత్రంలో నటిస్తున్నారు చైతూ. ఈ చిత్రం పేరు ‘ఎన్‌సి 24’ కాగా, ఈ మూవీకి ’విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది.
Also Read: 'దొంగ ము** కొడుకు..' వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్..! ఫ్యాన్స్ ఫైర్!
ఈ మూవీలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 2025 చివరలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Also Read: రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందిగా!
‘వృక్షకర్మ’గా..!
అయితే, చిత్రానికి ‘వృక్షకర్మ’ అనే టైటిల్‌తోపాటు మరికొన్ని ఇతర టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమా సంగీతాన్ని అజనీష్ లోక్‌నాథ్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని శ్యామ్‌దత్ అందిస్తున్నారు. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ అటవీ, కొండ ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోనుంది. డైరెక్టర్ కార్తీక్ దండు విజువల్ వండర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
Also Read: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!
Also Read: Delhi Railway station : ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన ఢిల్లీ రైల్వే స్టేషన్!