/rtv/media/media_files/2026/02/12/chiranjeevi-2026-02-12-11-49-23.jpg)
Chiranjeevi
Chiranjeevi: తెలుగు సినిమా రంగంలో దశాబ్దాలుగా అగ్రహీరోగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రయాణంలోని మొదటి అడుగును గుర్తుచేసుకున్నారు. కోట్లాది మంది అభిమానులను తన నటన, డ్యాన్స్, యాక్షన్తో అలరించిన ఆయన, తన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
Chiranjeevi Emotional Post
ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 11, 2026
ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది.
ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి.
ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు… pic.twitter.com/Rsc6UYmgiK
‘పునాది రాళ్లు’ సినిమా కోసం జీవితంలో మొదటిసారి కెమెరా ముందు నుంచున్న రోజు గురించి ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ఆ రోజు తనలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత భావాలను మాటల్లో చెప్పలేనని పేర్కొన్నారు. ఆ క్షణం ఇప్పటికీ నిన్న జరిగినట్టే అనిపిస్తుందని తెలిపారు. ఆ అనుభూతిని ఒక అందమైన కథలా ఇప్పటికీ గుర్తు చేసుకుంటానని చెప్పారు.
అలాగే ఆ సినిమా ద్వారా తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకం, ప్రోత్సాహమే తన నట జీవితానికి బలమైన పునాది అయిందని చెప్పారు. ఆ తొలి అవకాశమే తన సినీ ప్రయాణానికి నిజమైన ప్రారంభమని అన్నారు.
తనను మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు కూడా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల ప్రేమ, ఆశీర్వాదాలే తనకు అసలైన బలం అని మరోసారి పేర్కొన్నారు.
ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్న చిరంజీవి ఇప్పటికీ తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఇటీవల రిలీజైనా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో కూడా అభిమానులను అలరించారు. ఇంతటి విజయాల మధ్య కూడా తొలి అడుగును మరవకుండా గుర్తు చేసుకోవడం అభిమానులను కదిలిస్తోంది.
చిరంజీవి చేసిన ఈ భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఆయన సినీ ప్రయాణాన్ని తలుచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Follow Us