Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి సీక్రెట్ రిలేషన్? బాలయ్య షోలో బయటపడ్డ అసలు కథ!

హీరోయిన్ మీనాక్షి చౌదరి గాసిప్స్‌పై స్పందించారు. నటుడు సుశాంత్‌తో ప్రేమ సంబంధం లేదని, ఇద్దరూ మంచి స్నేహితులు మాత్రమేనని చెప్పారు. ముంబైలో యాక్టింగ్ వర్క్‌షాప్ లో ఆయన పరిచయం అయి, ఆయన వల్లే తాను మొదటి తెలుగు సినిమా అవకాశం పొందానని మీనాక్షి తెలిపారు.

New Update
Meenakshi Chaudhary

Meenakshi Chaudhary

Meenakshi Chaudhary: ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లిళ్ల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు ప్రేమలో ఉన్న జంటలు ఒక్కొక్కరిగా తమ బంధాన్ని బయటపెడుతూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల పెళ్లి తర్వాత మార్చి 6న అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల వివాహం జరగనుంది. ఇదే సమయంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి వ్యక్తిగత జీవితంపై కూడా కొంతకాలంగా కొన్ని గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆ విషయాలపై స్పందించారు.

తన అందం, నటనతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించిన హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. సాధారణంగా చాలా మంది నటీనటులు డాక్టర్ అవ్వాలని అనుకుని తర్వాత సినిమాల్లోకి వచ్చామని చెబుతుంటారు. కానీ నిజంగా డెంటిస్ట్ చదివి తర్వాత సినిమా రంగంలోకి వచ్చిన అరుదైన నటీమణుల్లో మీనాక్షి ఒకరు. ఆమె మొదట మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ ఒక్కో సినిమాతో ముందుకు సాగారు.

2019లో వచ్చిన హిందీ సినిమా ‘అప్‌స్టార్ట్స్’ ద్వారా ఆమె మొదటిసారి తెరపై కనిపించారు. తర్వాత 2021లో వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఖిలాడీ, హిట్ 2, గుంటూరు కారం, మట్కా, మెకానిక్ రాకీ వంటి సినిమాల్లో నటించారు. ఈ సమయంలో దర్శకుడు వెంకీ అట్లూరి తీసిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత విక్టరీ వెంకటేష్‌తో కలిసి చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా భారీ విజయం సాధించింది. దీంతో మీనాక్షి చౌదరి స్టార్ హీరోయిన్‌గా మరింత పాపులర్ అయ్యారు.

తెలుగు మాత్రమే కాదు, తమిళంలో కూడా ఆమె కొన్ని సినిమాల్లో నటించారు. ది గోట్, సింగపూర్ సెలూన్, కోలై వంటి చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'వృషకర్మ' సినిమాలో మీనాక్షి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆమె లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ఈ సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒక తెలుగు హీరోతో ఆమె కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపించాయి. ఆ హీరో మరెవరో కాదు.. అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నటుడు సుశాంత్. మీనాక్షి టాలీవుడ్‌లో మొదట నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాలో సుశాంత్ హీరోగా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం పెరిగి తర్వాత ప్రేమగా మారిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇద్దరూ కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించిన కొన్ని ఫోటోలు బయటకు రావడంతో ఆ గాసిప్స్ మరింత పెరిగాయి. అయితే ఈ వార్తలను మీనాక్షి పూర్తిగా ఖండించారు. తనకు సుశాంత్‌తో ప్రేమ సంబంధం లేదని, అతను మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ విషయం మీద గాసిప్స్ ఎక్కువ కావడంతో మీనాక్షి టీమ్ కూడా స్పందించింది. ఇద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని, దీనికి మించి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది.

అయితే తన కెరీర్ ప్రారంభంలో సుశాంత్ ఎంతో సహాయం చేశారని మీనాక్షి చెప్పారు. ఆయన వల్లే తనకు తెలుగు సినిమాలో అవకాశం వచ్చిందని ఆమె వెల్లడించారు.

ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షోలో మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడు వెంకీ అట్లూరి కూడా వచ్చారు. ఈ షోలో బాలకృష్ణ సరదాగా మాట్లాడుతుండగా మీనాక్షిని కొన్ని ప్రశ్నలు అడిగారు.

హర్యానాలో రెజ్లింగ్ ఎక్కువగా ఉంటుంది, మరి నువ్వు సినిమాల్లోకి ఎలా వచ్చావు అని బాలయ్య అడగగా మీనాక్షి సమాధానం ఇచ్చారు. తాను మొదట డెంటిస్ట్ అని, తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నానని చెప్పారు. ఆ పోటీలు పూర్తయ్యాకే సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపారు. నిజానికి సినిమాల్లోకి రావాలని ముందుగా అనుకోలేదని, అది అంతా అదృష్టం వల్ల జరిగిందని చెప్పారు.

ముంబైలో ఒక యాక్టింగ్ వర్క్‌షాప్‌లో పాల్గొన్నప్పుడు ఒక నటుడితో కలిసి పని చేసే అవకాశం వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో అతను ఎవరో తెలియదని, తర్వాత అతను తెలుగు హీరో అని తెలిసిందని చెప్పారు. ఆ వ్యక్తి సుశాంత్ అని, అతని వల్లే తాను తెలుగులో మొదటి సినిమా చేసే అవకాశం దొరికిందని మీనాక్షి వివరించారు.

ఇప్పుడు మీనాక్షి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి ఆమె పేరు టాలీవుడ్‌లో చర్చగా మారింది.

Advertisment
తాజా కథనాలు