గొప్ప మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. 50 స్కూళ్ళు దత్తత తీసుకొని.. మంచు లక్ష్మి మరో 20 స్కూళ్లను దత్తత తీసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో 20 స్కూళ్లను దత్తత తీసుకుంటున్నట్లు మంచు లక్ష్మి ప్రకటించారు. గత ఏడాది 30, ఇప్పుడు మరో 20.. మొత్తం 50 స్కూళ్లను దత్తత తీసుకున్నామని వాటికి సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నారు. By Anil Kumar 21 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా సినీ రంగంలో అడుగుపెట్టి తన సొంత టాలెంట్ తో మంచి నటిగా గుర్తింపును తెచ్చుకున్నారు మంచు లక్ష్మి. అటు నిర్మాతగానూ రాణించారు. సోషల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొనే ఈమె.. తన గొప్ప మనసు చాటుకుంది. ఇప్పటికే ఎన్నో స్కూళ్లను దత్తత తీసుకొని అందులోని పిల్లలకు మంచి విద్య అందేలా కృషి చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మి మరో 20 స్కూళ్లను దత్తత తీసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలో 20 స్కూళ్లను దత్తత తీసుకుంటున్నట్లు మంచు లక్ష్మి స్వయంగా ప్రకటించారు. గత ఏడాది 30 స్కూళ్ళు.. ఇప్పుడు మరో 20.. మొత్తం 50 స్కూళ్లను దత్తత తీసుకున్నామని వాటికి సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నారు. నేడు జిల్లా కేంద్రానికి విచ్చేసిన సిని నటి, Teach for Change అధ్యక్షులు మంచు లక్ష్మి గారు జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచుటకు Smart Class Roomలు ప్రారంభిస్తున్నందున వారిని అభినందించి, తమ సహకారం కూడా అందిస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు@TelanganaCMO @TelanganaCS pic.twitter.com/SbTky52hap — Collector Jogulamba (@Collector_JGL) October 21, 2024 Also Read : 'తంగలాన్' ఓటీటీ రిలీజ్ కు లైన్ క్లియర్.. కోర్టులో కేసు కొట్టివేత " గద్వాల్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. టీచ్ ఫర్ ఛేంజ్ కోసం ఇక్కడికి రావడం ఇది రెండోసారి. నితి అయోగ్ ద్వారా వెనకబడిన ప్రాంతాలకు వెళ్లి అక్కడి పిల్లలకు స్మార్ట్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేయాలి అన్నదే మా ఉద్దేశ్యం. గతేడాది 30 స్కూల్స్‌ను అలా చేశాం. ఇప్పుడు ఇంకొక 20 స్కూల్స్‌ను చేయబోతున్నాం. వాటి ఓపెనింగ్స్ కోసమే వచ్చాను. మనందరం కలిసే ఈ పనిచేస్తున్నాం. ఇక్కడ నుండి చదువుకొని వెళ్లిపోయినవారు కూడా మంచి పొజిషన్స్‌లో ఉండుంటారు. మీరు కూడా ఒక స్కూల్‌ను బాగుచేస్తే ఊరినే బాగుచేసినట్టు.." అని చెప్పుకొచ్చారు. కాగా గద్వాల్ జిల్లాలోనే 20 స్కూళ్లను దత్తత తీసుకోవడం వెనుక కారణం ఏంటని అడిగితే.. గట్టు మండలంలో అక్షరాస్యత సంఖ్య తక్కువగా ఉండడం వల్లే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నామని తెలిపారు. టీచ్ ఫర్ చేంజ్ ద్వారా మంచు లక్ష్మి చేయూత..ఏకంగా 30 స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు ఫ్యామిలీ..#ManchuLakshmi #Teachforachange # pic.twitter.com/G7hcGKrL1o — RTV (@RTVnewsnetwork) October 21, 2024 Also Read : నల్ల ప్యాంటు, గళ్ళ కోటు, టీ షర్ట్.. వాహ్! 'రాజా సాబ్' లుక్ అదిరిందయ్యా టీచర్స్ కు ప్రత్యేక ట్రైనింగ్.. తాము దత్తత తీసుకున్న స్కూల్స్ లో తీసుకురానున్న మార్పుల గురించి మంచు లక్ష్మి వివరిస్తూ..' ప్రైవేట్ స్కూల్స్‌లో ఉన్న వసతులు అన్నీ గవర్నమెంట్ స్కూల్స్‌లోకి కూడా తీసుకొస్తాం. టీచర్స్‌కు కూడా మరింత మంచి ట్రైనింగ్ ఇస్తాం. మా వాలంటీర్స్ వారిని దగ్గరుండి ప్రోత్సహిస్తారు. దానికోసమే విద్యా వాలంటీర్స్‌ను క్రియేట్ చేస్తాం. గట్టు మండలంలో ఎక్కువమంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్‌లో కూడా ఒక్కరే టీచర్ ఉంటున్నారు. అందుకే టీచర్స్ సపోర్ట్‌ను కూడా స్కూల్స్‌కు అందించాలని అనుకుంటున్నాం..' అని పేర్కొన్నారు. #manchu-lakshmi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి