Surya 45: 'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

'సూర్య 45' సినిమాతో మలయాళ నటి అనఘా రవి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై మంచి హైప్ నెలకొంది. ప్రస్తుతం సూర్య రెట్రో చిత్రం మే 1న విడుదల కానుంది.

New Update
Surya 45

Surya 45

Surya 45: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా రెట్రో(Retro) షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, సినిమాను మే 1వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక సూర్య ప్రస్తుతం సూర్య 45 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రిష కథానాయికగా ఎంపిక కాగా, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ రాజ్,  ఎస్.ఆర్. ప్రభు నిర్మాణం వహిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాత్విక, యోగి బాబు, నట్టి వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి వైరల్ గా మారింది. మలయాళ భామ అనఘా రవి ఈ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, సూర్య 45 సినిమాలో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రంలో తాను కీలక పాత్ర పోషిస్తున్నానని వెల్లడించారు.
అనఘా రవి, మమ్ముట్టి–జ్యోతికలతో కలిసి నటించిన మలయాళ చిత్రం ‘కాతల్’లో వారి కూతురిగా కనిపించి మంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఆమె నటించిన మరో మలయాళ సినిమా అలప్పుజ జింఖానా తాజాగా విడుదలైంది. అయితే ఇప్పుడు ఆమె కోలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
సూర్య, త్రిష, అనఘా రవి లాంటి నటులతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. మరోసారి సూర్య అభిమానులకు మసాలా, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా మేళవింపుతో కూడిన సినిమా రాబోతోందని  ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Actress Vaishnavi: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి వైష్ణవి.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్

కన్నడ నటి వైష్ణవి గౌడ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి అనుకూల్ మిశ్రాతో ఈరోజు ఆమె ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను వైష్ణవి తన సోషల్ మీడియాలో పంచుకుంది.

New Update
actress Vaishnavi engagement

actress Vaishnavi engagement

Actress Vaishnavi:  ప్రముఖ కన్నడ నటి, బుల్లితెర ఫేమ్ వైష్ణవి గౌడ త్వరలో వివాహ బంధానికి నాంది పలకబోతున్నారు. ఈరోజు తన ప్రియుడు అనుకూల్ మిశ్రాతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వైష్ణవి ఇన్ స్టాగ్రామ్ లో ఎంగేజ్మెంట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.  దీంతో అభిమానులు, బుల్లితెర సెలెబ్రెటీలు ఆమెకు విషెష్ తెలియజేస్తున్నారు. ఈ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సెలెబ్రెటీలు హాజరయ్యారు. కన్నడ నటి  అమూల్య గౌడ, ప్రెజెంబర్‌ చైత్ర వాసుదేవన్, పూజా లోకేష్, రీతూ సింగ్, జ్యోతి కిరణ్ తదితరులు నిశ్చితార్ధ వేడుకలో సందడి చేశారు. 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

ఎంగేజ్మెంట్ వేడుక కోసం వైష్ణవి ఫుల్లీ ఎంబ్రాయిడర్డ్ క్రీమ్ కలర్ లెహంగా ధరించింది. పచ్చ రాళ్ళ చోకర్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మాంగ్ టీకాతో అందంగా ముస్తాబైంది. మరోవైపు వరుడు అనుకూల్ మిశ్రా ఐవరీ షేర్వానీ ధరించి రాయల్‌ లుక్‌లో

Also Read : Allu Arjun ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లతో బన్నీ.. అట్లీ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్

అగ్నిసాక్షి సీరియల్

వైష్ణవి  ' సీతారామ', అగ్నిసాక్షి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా దగ్గరైంది.  గత పదేళ్లకు పైగా టీవీ పరిశ్రమలో రాణిస్తోంది. మొదటగా 'దేవి' అనే సీరియల్ చేసింది. అందులో టైటిల్ రోల్లో మెప్పించిన వైష్ణవి వరుస ఆఫర్లు దక్కించుకుంది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది.  

telugu-news | cinema-news | latest-news 

Also Read :  ప్రయాణికులకు గమనిక.. సికింద్రాబాద్‌ To విశాఖకు వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రూటు మారింది!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు