Malavika Mohanan: వ్యూస్ కోసం హద్దులు దాటొద్దు.. జర్నలిస్టులకు మాళవిక మోహనన్ స్ట్రాంగ్ వార్నింగ్!

నటి మాళవిక మోహనన్ తాజాగా ఒక ఈవెంట్‌లో కొందరు జర్నలిస్టులు అడిగిన అసభ్యకర ప్రశ్నలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యూస్ కోసం ఇలా చేయొద్దని అన్నారు. అలాగే విజయ్‌పై తనకు ఎంతో గౌరవం ఉందని, మీడియా సమావేశాల్లో సెలబ్రిటీలను మర్యాదగా ప్రశ్నించాలని కోరారు.

New Update
Malavika Mohanan

Malavika Mohanan

Malavika Mohanan: మాళవిక మోహనన్ తాజాగా తమిళనాడులో జరిగిన ఒక కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

మాళవిక మాట్లాడుతూ, తమిళనాడు మీడియా, జర్నలిస్టుల పట్ల తనకు ఎప్పటినుంచో గౌరవం ఉందని చెప్పారు. కానీ ఇటీవల జరిగిన ఈవెంట్‌లో కొంతమంది రిపోర్టర్లు పదేపదే అసభ్యంగా, అవసరం లేని ప్రశ్నలు అడగడం తనకు బాధ కలిగించిందని తెలిపారు. కేవలం వ్యూస్, పాపులారిటీ కోసం ఇలా చేయడం సరైంది కాదని ఆమె అన్నారు.

అలాగే Vijayవిజయ్‌ తో తనకున్న అనుబంధం గురించి కూడా ఆమె మాట్లాడారు. గత ఏడేళ్లుగా విజయ్‌తో మంచి పరిచయం ఉందని, ఆయనపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఒక నటుడిగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా విజయ్ చాలా మంచి వ్యక్తి అని మాళవిక తెలిపారు.

విజయ్ సాధించిన విజయాలు, ఆయన ప్రయాణాన్ని దగ్గర నుంచి చూడటం తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో జరిగే ప్రెస్ మీట్‌లు, మీడియా సమావేశాల్లో సెలబ్రిటీలను గౌరవంగా ప్రశ్నించాలని, అది అందరికీ మంచిదని మాళవిక మోహనన్ సూచించారు.

Advertisment
తాజా కథనాలు