Mahesh Babu : మూడు నెలల జీతం బ్రో.. మహేష్ టీ షర్ట్ ధర అన్ని వేలా?

మహేష్ బాబు ఇటీవల ఓ బిజినెస్ మాన్ బర్త్ డే వేడుకలో వైట్ కలర్ టీ షర్ట్, రెడ్ కలర్ క్యాప్ తో క్యాజువల్ లుక్ లో కనిపించాడు. గివెన్చీ బ్రాండ్ కు చెందిన ఈ టీ షర్ట్ ధర అక్షరాలా రూ.74,000. చాలా సింపుల్ గా ఉన్న ఈ టీ షర్ట్ కాస్ట్ తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

New Update
dvv

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ ఎంత రిచ్ గా ఉంటుందో తెలిసిందే. వాళ్ళు కాళ్లకు తొడుక్కునే చెప్పుల దగ్గర్నుంచి వేసుకునే బట్టలు, వాచీలు, వాడే కార్లు.. ఇలా అన్నీ చాలా కాస్ట్లీ గా ఉంటాయి. ముఖ్యంగా హీరోల కాస్ట్యూమ్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. వాటి కాస్ట్ తెలిసి నెటిజన్స్ షాక్ అవుతుంటారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ విషయంలోనూ ఇదే జరిగింది. మ్యాటర్ ఏంటంటే.. మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్ ఇలా పలువురు హీరోలు ఇటీవల మాల్ దీవ్స్‌లో ప్రత్యక్షం అయ్యారు. ఓ బిజినెస్ మాన్ బర్త్ డే వేడుకలో ఈ స్టార్స్ అంతా సందడి చేశారు. ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో మహేష్ బాబు చాలా సింపుల్ గా కనిపించారు. 

Also Read : అల్లు అర్జున్ కు శ్రీలీల స్పెషల్ గిఫ్ట్.. అందులో ఏముందంటే?

టీ షర్ట్ కే అన్ని వేలా?

వైట్ కలర్ టీ షర్ట్, రెడ్ కలర్ క్యాప్ తో క్యాజువల్ లుక్ లో కనిపించాడు. అయితే ఇప్పుడు ఆ టీ షర్ట్ ధర నెటిజన్స్ ను షాక్ అయ్యేలా చేస్తుంది. చూడటానికి సింపుల్  టీ షర్ట్ లానే ఉంది కానీ దాని ధర మాత్రం భారీగా ఉంది. గివెన్చీ బ్రాండ్ కు చెందిన ఈ టీ షర్ట్ ధర అక్షరాలా రూ. 74,000. చాలా సింపుల్ గా ఉన్న ఈ టీ షర్ట్ కాస్ట్ తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. 

అంతేకాకుండా 'అది నా మూడు నెలల జీతం బ్రో అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ఆ టీ షర్ట్ కు పెట్టిన డబ్బులతో నా రెండు నెలల ఇంటి అవసరాలు తీరుతాయని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. దీంతో మహేష్ కాస్ట్లీ టీ షర్ట్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా పనుల్లో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది, ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Also Read : శివకార్తికేయన్ 'అమరన్'.. థియేటర్ పై బాంబు దాడి

Advertisment
Advertisment
తాజా కథనాలు