/rtv/media/media_files/2025/11/25/mahavatar-narsimha-2025-11-25-12-22-56.jpg)
Mahavatar Narsimha
Mahavatar Narsimha: చిన్న సినిమాగా సైలెంట్ గా విడుదలైన ‘మహావతార్ నరసింహ’ థియేటర్లలో ఊహించని స్థాయిలో దూసుకుపోయి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విడుదలైన రోజు నుంచి మౌత్ టాక్ తో ఈ సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది. కేవలం మౌత్ టాక్ ఈ యానిమేటెడ్ చిత్రాన్ని ఒక భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టింది. థియేటర్లలో విజయం సాధించిన తర్వాత, నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమా రికార్డు వ్యూస్ సాధించి మరోసారి హంగామా క్రియేట్ చేసింది.
98th Oscar Nomination
ఇప్పుడు ఈ చిత్రం మరో అరుదైన గౌరవం అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars) నామినేషన్ దశకు ఈ సినిమా అధికారికంగా అర్హత సాధించింది. భారతీయ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించిన ఈ చిత్రం, ఇప్పుడు ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ లోకెళ్ళే అవకాశాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఫైనల్ నామినేషన్స్‌ను జనవరి 22, 2026 న ప్రకటించనున్నారు.
యానిమేషన్లో భారత సినిమాకు అరుదైన అవకాశం. యానిమేటెడ్ కేటగిరీలో ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ కోసం మొత్తం 35 యానిమేటెడ్ సినిమాలు పోటీ పడుతున్నాయి. వాటిలో ‘మహావతార్ నరసింహ’ కూడా ఒకటి. ఈ చిత్రం ఫైనల్ నామినేషన్లోకి చేరితే, ఆస్కార్ లో నామినేషన్ పొందిన తొలి భారతీయ యానిమేటెడ్ చిత్రం అవుతుంది. ఇదే కారణంగా ఇండియన్ సినీ ప్రపంచం మొత్తం ఈ చిత్రంపై దృష్టి పెట్టింది.
Also Read: ప్రభాస్ ‘స్పిరిట్’లో మరో బడా హీరో.. ఏకంగా ఆ సినిమాతో కనెక్షన్..?
పురాణాల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమాను నరసింహ పురాణం, విష్ణు పురాణం, శ్రీమద్భాగవతం ఆధారంగా తీసారు. పురాణాల్లోని సంఘటనలు, నరసింహ అవతారం యొక్క శక్తి , భావనను ఆధునిక యానిమేషన్‌తో చూపించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.
ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న భారతీయ సినిమాలు, ఇదిలా ఉంటే, దర్శకుడు నీరజ్ ఘయ్వాన్ తీసిన ‘హోంబౌండ్’ ఇప్పటికే భారత్ తరఫున ఆస్కార్ కు అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఇది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడుతోంది. ఇప్పుడు ‘మహావతార్ నరసింహ’ కూడా మరో కేటగిరీలో భారత్ నుంచి నిలబడటం అభిమానుల్లో గర్వకారణంగా మిగిలింది.
Also Read: దుమ్ము రేపుతోన్న 'రాజు వెడ్స్ రాంబాయి' బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. 4 డేస్ కలెక్షన్స్ ఇదిగో!
ఆస్కార్ నామినేషన్స్ ప్రకటన: జనవరి 22, 2026
ఆస్కార్ అవార్డ్స్ వేడుక: మార్చి 15, 2026
ఇప్పటికే థియేటర్లలో, ఓటీటీలో బంపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా భారత సినిమాకు గుర్తింపు తెచ్చే అవకాశాన్ని అందుకుంది. ‘మహావతార్ నరసింహ’ ఫైనల్ నామినేషన్లోకి వెళ్తుందా? అన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది.
Follow Us