Om Bam Bhole Song: యూట్యూబ్ లో అదరగొడుతున్న మహాశివరాత్రి స్పెషల్ సాంగ్

మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన ఎన్నో భక్తిరస గీతాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది కూడా మహా శివరాత్రి సందర్భంగా మరో శివ గీతం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'అకీ క్రియేటివ్ వర్క్స్ ' సంస్థ 'ఓం భం భోలే' అంటూ ఓ మంచి డివోషనల్ ఆల్బమ్ రిలీజ్ చేసింది.

New Update
Om Bam Bhole Song

Om Bam Bhole Song

Om Bam Bhole Song:  మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన ఎన్నో భక్తిరస గీతాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది కూడా మహా శివరాత్రికి మరో శివ గీతం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'అకీ క్రియేటివ్ వర్క్స్ ' సంస్థ 'ఓం భం భోలే' అంటూ ఓ మంచి డివోషనల్ ఆల్బమ్ రిలీజ్ చేసింది. శివ భక్తులతో  పాటు అటు ప్రేక్షకులను కూడా ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. పరమశివుడి భక్తిలో మైమరిచేలా ఈ పాటను రూపొందించారు. 

మహాశివరాత్రి కానుకగా

పాటలో నటీనటుల పర్ఫార్మెన్స్, కాస్ట్యూమ్స్ భక్తి భావం ఉట్టిపడేలా చేశాయి. శివయ్య గొప్పతనాన్ని వివరిస్తూ పాటను అందంగా తీర్చిదిద్దారు. ఇనుమడుగు అనిల్ నటించడంతో పాటు పాటకు లిరిక్స్ కూడా అందించారు.  ఆయనతో పాటు అజయ్ ఇనమడుగు, అజయ్ సన్నపు, మరియు అజాస్ జాన్ శివ భక్తులుగా ఆకట్టుకున్నారు. గతంలో 'ఏమి మాయ ప్రేమలోన' వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ తో అలరించిన  అకీ క్రియేటివ్ వర్క్స్  సంస్థ.. ఈ సారి సరికొత్తగా డివోషనల్ వైబ్స్ తో ప్రేక్షకులను అలరించింది. ప్రశాంత్ ఈ పాటకు సంగీతం అందించడంతో స్వయంగా ఆయనే పాడారు. చరణ్ పన్నాల సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. నాగేంద్ర ఇనమడుగు నటుడు, లిరిసిస్ట్ తో పాటు నిర్మాత కూడా వ్యవహరించారు. మహాశివరాత్రి కానుకగా విడుదలైన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. 

Also Read:  Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ తో మంత్రి మనవడి లింగాష్టకం వీడియో వైరల్!

Advertisment
తాజా కథనాలు