Korean Kanakaraju: కొరియాలో ‘కనకరాజు’ సందడి.. షూటింగ్ పిక్స్ వైరల్!

వరుణ్ తేజ్ నటిస్తున్న 'కొరియన్ కనకరాజు' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దర్శకుడు మెర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రానికి చివరి షెడ్యూల్ దక్షిణ కొరియాలో జరుగుతోంది. సంగీతాన్ని ఎస్ థమన్ అందిస్తున్నారు.

New Update
Korean Kanakaraju

Korean Kanakaraju

Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘కొరియన్ కనకరాజు’ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మెర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.

హారర్, కామెడీ అంశాలు కలిపి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కథలో భారతదేశం, దక్షిణ కొరియా నేపథ్యాలు కనిపించనున్నాయి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇప్పటివరకు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

ఇప్పటికే ఇండియాలో ఎక్కువ భాగం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా టీమ్ దక్షిణ కొరియాలో చివరి షెడ్యూల్‌ను ప్రారంభించింది. అక్కడ ఒక వారం పాటు షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో ముఖ్యమైన సన్నివేశాలు, కొన్ని పాటలను చిత్రీకరించనున్నారు.

ఈ షూటింగ్‌లో వరుణ్ తేజ్‌తో పాటు హీరోయిన్ రితికా నాయక్, నటుడు సత్య కూడా పాల్గొంటున్నారు. కొరియాలోని అందమైన ప్రదేశాల్లో ఈ సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. ఆ వీడియోకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా అది వైరల్ అయ్యింది. గ్లింప్స్ చూసిన ప్రేక్షకులకు సినిమా ఒక ఫన్ హారర్ కామెడీగా ఉండబోతుందని అర్థమైంది.

ఈ సినిమాకు సంగీతాన్ని ఎస్ థమన్ అందిస్తున్నారు. ఆయన ఇప్పటికే చాలా హిట్ ఆల్బమ్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కూడా మంచి పాటలు, ఎనర్జీతో కూడిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.

దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ చివరి షెడ్యూల్ పూర్తయ్యాక సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.

Advertisment
తాజా కథనాలు