Mark Glimpse: కన్నడ స్టార్ హీరో సుదీప్ కిచ్చా 47వ మూవీ టైటిల్ ని రివీల్ చేస్తూ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి 'మార్క్' అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ కి తగ్గట్లుగా గ్లింప్స్ వీడియో మార్క్ సెట్ చేసేలా అదిరిపోయిందని ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. మ్యాడ్, యాటిట్యూడ్, రూత్లెస్, కింగ్ అంటూ హీరో పాత్రను నెక్స్ట్ లెవెల్లో పరిచయం చేశారు. గ్లింప్స్ ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. 'కాంతార' అజినీష్ లోకనాథ్ సంగీతం అందించారు. సత్య జ్యోతి ఫిలిమ్స్, కిచ్చా క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
The fire is lit. The journey begins. 🔥
— Kichcha Sudeepa (@KicchaSudeep) September 1, 2025
The Title Announcement Title Teaser of K-47 is unveiled.
🔗 - https://t.co/GEAm4z43zT#BaadShahDay#Kichcha47#Mark#MarkTheFilm@KicchaSudeep@Kichchacreatiin@SathyaJyothi@VKartikeyaa@AJANEESHB@iampriya06@shekarchandra71… pic.twitter.com/OlJDHemPA1
క్రిస్మస్ కానుకగా..
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 60% పూర్తవగా.. అక్టోబర్ నాటికి మొత్తం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు సుదీప్ తెలిపారు. క్రిస్మస్ పండుగ కానుకగా ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది.
ఈ ప్రాజెక్ట్ తో పాటు 'బిల్లా రంగా బాషా' అనే మరో ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. 'విక్రాంత్ రోణ' తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండవ చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ లోనే ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారట సుదీప్ కిచ్చా. ఇది వచ్చే ఏడాది 2026 లో విడుదల కానుంది. వీటితో పాటు గతేడాది విడుదలైన మ్యాక్స్ మూవీ సీక్వేల్ కూడా చేసే ఆలోచనలో ఉన్నారట సుదీప్ కిచ్చా. దీనికి సంబంధించిన కథలను కూడా వింటున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే కన్నడతో పాటు తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజమౌళి 'ఈగ ' సినిమాలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆయన తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ.. ఈగ పాత్రతోనే ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. సుదీప్ తెలుగులో బహుబలి పార్ట్ 1, చిరంజీవి సైరా నరసింహా రెడ్డి వంటి చిత్రాల్లో క్యామియో రోల్స్ లో అలరించారు.
సినిమాలతో పాటు టీవీ షోలతోనూ అలరిస్తుంటారు. గత 11 సీజన్స్ గా కన్నడ బిగ్ బాస్ షో హోస్ట గా వ్యవహరిస్తున్నారు. అలాగే కిచ్చ క్రియేషన్స్ ద్వారా పలు టీవీ షోలను కూడా నిర్మిస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో కూడా నటిస్తారు. అన్ని భాషల్లోనూ సుదీప్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టివ్.
Follow Us