Kanchana 4: ‘కాంచన 4’తో రాఘవ లారెన్స్ హిట్ ఫ్రాంచైజీకి ది ఎండ్.. ఎమోషన్ అవుతోన్న ఫ్యాన్స్‌!

రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న ‘కాంచన 4’ ఈ హిట్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో చివరి సినిమా కావచ్చని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే, నోరా ఫతేహి నటిస్తున్నారు. లారెన్స్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Kanchana 4

Kanchana 4

Kanchana 4: దక్షిణాది సినీ ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న హారర్ కామెడీ సిరీస్ కాంచన Kanchana త్వరలో ముగియనున్నట్టు వార్తలు వస్తున్నాయి. నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ Raghava Lawrence తెరకెక్కిస్తున్న ‘కాంచన 4’ Kanchana 4 ఈ ఫ్రాంచైజీలో చివరి సినిమా కావచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో అభిమానులు ఒకవైపు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మరోవైపు ఈ సిరీస్ ముగియబోతుందనే వార్తతో భావోద్వేగానికి గురవుతున్నారు.

ఈ ఫ్రాంచైజీ ప్రయాణం 2007లో వచ్చిన ముని Muni సినిమాతో మొదలైంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 2011లో వచ్చిన కాంచన Kanchana భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హారర్, కామెడీ, ఎమోషన్ కలిపిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

తర్వాత వచ్చిన కాంచన 2 Kanchana 2 కూడా మంచి వసూళ్లు సాధించింది. ఇందులో హారర్, కామెడీ, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2019లో విడుదలైన కాంచన 3 Kanchana 3 కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇలా వరుస హిట్లతో ఈ ఫ్రాంచైజీ దక్షిణాదిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు రాబోతున్న కాంచన 4 Kanchana 4 ఈ సిరీస్‌లోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈసారి సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ నటి నోరా ఫతేహి Nora Fatehi ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇదే ఆమెకు తమిళంలో తొలి సినిమా కావడం విశేషం.

ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే Pooja Hegde కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే Devadarshini, Anandaraj, Ramachandra Raju, కమలేష్ జగన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆనంద్ రాజ్, రామచంద్ర రాజు నెగెటివ్ పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం.

ఇటీవల రాఘవ లారెన్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఆయన లుక్ సూపర్ స్టార్ రజినికాంత్ Rajinikanth నటించిన కాలా Kaala సినిమాలోని స్టైల్‌ను గుర్తు చేసింది. నల్ల షర్ట్, తెల్ల గడ్డం, బ్లాక్ హెయిర్‌తో కనిపించిన లారెన్స్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. “లోడింగ్” అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది.

ఈ సినిమాకు కథ, దర్శకత్వం, నిర్మాణం అన్నీ రాఘవ లారెన్స్ చూసుకుంటున్నారు. గోల్డ్‌మైన్స్ టెలీఫిల్మ్స్‌కు చెందిన మనీష్ షా, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమా ద్వారా వచ్చే తన పారితోషికంతో తాను మొదటగా కొనుకున్న ఇంటిని స్కూల్‌గా మార్చాలని లారెన్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో అభిమానులు ఆయన నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

గతంలో కాంచన Kanchana హిందీలో కూడా లక్ష్మి Laxmii పేరుతో రీమేక్ అయింది. అందులో అక్షయ్ కుమార్ Akshay Kumar హీరోగా నటించారు. ఇప్పుడు ‘కాంచన 4’తో ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీకి గ్రాండ్ ముగింపు ఇవ్వాలని లారెన్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అభిమానులంతా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు