/rtv/media/media_files/2026/05/28/june-box-office-2026-05-28-12-39-29.jpg)
June Box Office
June Box Office: 2026 జూన్ నెల టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మంచి వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలలో విభిన్న కథలతో పాటు భారీ అంచనాలు ఉన్న సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. జూన్ నెల మొత్తం రిలీజ్ షెడ్యూల్ ఇలా ఉంది.
జూన్ మొదటి వారం (జూన్ 3 నుంచి జూన్ 5 వరకు)
మొదటి వారంలోనే థియేటర్లలో సందడి ప్రారంభం కానుంది. జూన్ 3న ‘అసురాసుర’ సినిమా విడుదల అవుతుంది. జూన్ 4న రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ థియేటర్లలోకి రానుంది. జూన్ 5న ‘రావ్ బహదూర్’ సినిమా రిలీజ్ కానుంది. అదే రోజున హాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
జూన్ రెండో వారం (జూన్ 11)
ఈ వారం ఒకే ఒక్క సినిమా విడుదల కానుంది. జూన్ 11న ‘సంగీతం’ సినిమా థియేటర్లలోకి రానుంది.
జూన్ మూడో వారం (జూన్ 19)
ఈ వారం బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ కనిపించనుంది. ఒకే రోజు నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. జూన్ 19న ‘బాలన్ ది బాయ్’, ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’, హారర్ కామెడీగా తెరకెక్కిన ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’, అలాగే ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
జూన్ చివరి వారం (జూన్ 26)
చివరి వారంలో భారీ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. జూన్ 26న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’ విడుదల కానుంది. అదే రోజున స్పోర్ట్స్ డ్రామా ‘సూపర్ గోల్’ కూడా రిలీజ్ అవుతుంది. అలాగే పొలిటికల్ ఇంటెన్స్ డ్రామాగా వస్తున్న ‘లెనిన్’ కూడా అదే తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.
మొత్తం మీద 2026 జూన్ నెలలో విభిన్న జోనర్ల సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడనుంది. ఏ సినిమా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందో చూడాలి.
Follow Us