/rtv/media/media_files/2026/05/07/m4m-movie-2026-05-07-09-09-02.jpg)
M4M Movie
M4M Movie: అమెరికాలో నివసిస్తున్న నటి జో శర్మ Jo Sharma ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M: Motive For Murder ఇప్పుడు సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని కలిగిస్తోంది. దర్శకుడు మోహన్ వడ్లపట్ల Mohan Vadlapatla తెరకెక్కించిన ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
సినిమా థియేటర్లలోకి రాకముందే అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచంలోని పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ మూవీ మొత్తం 15 అవార్డులు గెలుచుకుంది. లాస్ ఏంజెల్స్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ ఫిల్మ్ అవార్డు దక్కగా, లండన్‌లో దర్శకుడు మోహన్ వడ్లపట్లకు ప్రత్యేక గౌరవం లభించింది.
అలాగే జో శర్మకు న్యూయార్క్, హాలీవుడ్, సాంటా మోనికా ఫిలిం ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటి అవార్డులు వచ్చాయి. ముఖ్యంగా Cannes Film Festivalలో ఈ సినిమా ప్రీమియర్ ప్రదర్శన సమయంలో ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టడం మూవీ టీమ్‌కు పెద్ద విజయంగా మారింది.
Also Read: TMC రెండు ముక్కలు...మమత మీటింగ్‌కు 10 మంది ఎమ్మెల్యేల డుమ్మా!
ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉండబోతుందని దర్శకుడు తెలిపారు. ప్రపంచంలో ఇప్పటివరకు రాని కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందించామని చెప్పారు. ప్రముఖ చిత్రకారులు Raja Ravi Varma, Pablo Picasso పెయింటింగ్స్‌లా కనిపించే విధంగా హత్యలు జరుగుతాయని, అదే కథలో ప్రధాన ఆసక్తి అని చెప్పారు.
Also Read: విజయ్ నీకు ఆరు నెలలు టైమ్ ఇస్తాం.. స్టాలిన్ సంచలన కామెంట్స్!
ఇంకా ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచేందుకు మూవీ టీమ్ ప్రత్యేక ప్రకటన చేసింది. సినిమా మొదటి రోజే అసలు విలన్ ఎవరో సరిగ్గా చెప్పిన వారికి లక్ష రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు.
Also Read: అదిరిపోయే అప్‌డేట్.. బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్!
ఈ సినిమాలో జో శర్మ ‘రాధ’ అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆమె దాదాపు మూడు సంవత్సరాలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. నటిగా మాత్రమే కాకుండా, కథ రాసే పనిలో కూడా భాగమయ్యారు. దర్శకుడు మోహన్ వడ్లపట్ల, రాహుల్ అడవలలతో కలిసి స్క్రిప్ట్‌పై పని చేసినట్లు చెప్పారు.
శాన్ ఫ్రాన్సిస్కోలో పెరిగినా, తన కుటుంబం హైదరాబాద్‌కు చెందినదని జో శర్మ తెలిపారు. తెలుగు సినిమాలంటే తనకు చిన్నప్పటి నుంచే ఇష్టమని చెప్పారు. ముఖ్యంగా చిరంజీవి, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు తనకు చాలా ఇష్టమని తెలిపారు.
గ్లామర్‌తో పాటు మంచి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలని ఉందని, ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమని జో శర్మ చెప్పారు.
Follow Us