జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్ కి యాక్సిడెంట్!

జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్ కారు రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. షూటింగ్ కోసం వెళ్తుండగా.. తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో రాంప్రసాద్ గాయాలపాలైనట్లు సమాచారం.

New Update
ram prasad

ram prasad

Jabardast Ramprasad: జబర్దస్త్ ఫేమ్ ఆటో రామ్ ప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎప్పటిలాగే ఈరోజు కారులో షూటింగ్ కోసం కారులో వెళ్తుండగా.. తుక్కుగూడ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. రాంప్రసాద్ వెళ్తున్న కారును వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టడంతో.. రాంప్రసాద్ కారు ముందున్న కారును ఢీకోట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలియగానే రామ్ ప్రసాద్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రామ్ ప్రసాద్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

జబర్దస్త్ కమెడియన్ గా 

జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో రామ్ ప్రసాద్ ఒకడు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్ కాంబో ప్రేక్షకులలో  విపరీతమైన క్రేజ్ లభించింది. ఇక రామ్ ప్రసాద్ తన ఆటో పంచులు, కామెడీ టైమింగ్ తో ఆటో రామ్ ప్రసాద్ గా మారిపోయాడు. జబర్దస్త్ ఫేమ్ తో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా అలరించాడు రామ్ ప్రసాద్. నేను లోకల్, బెదురులంక, ఫ్యామిలీ స్టార్, శాకినీ  డాకినీ వంటి సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం శ్రీదేవీ డ్రామా కంపెనీ,  పలు టీవీ షోస్ లో సందడి చేస్తున్నాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు