Rajasekhar: శ్రీదేవి తో నా పెళ్లి జరగాల్సింది.. కానీ.. రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్!

రాజశేఖర్ పాడ్‌కాస్ట్‌లో జీవితతో ప్రేమ, పెళ్లి ముందు జరిగిన ఆసక్తికర సంఘటనలు పంచుకున్నారు. ఒక సమయంలో శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్ వచ్చినా, చివరికి జీవితనే పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. తన కెరీర్, మిస్ అయిన సినిమా అవకాశాల గురించి కూడా వివరించారు.

New Update
Rajasekhar

Rajasekhar

Rajasekhar: సీనియర్ హీరో రాజశేఖర్ ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త రకాల పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల శర్వానంద్ Sharwanand నటించిన ‘బైకర్’ సినిమాలో తండ్రి పాత్రలో కనిపించి మెప్పించారు.

ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశేఖర్, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పారు. ముఖ్యంగా తన పెళ్లి ముందు జరిగిన సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాజశేఖర్, జీవిత Jeevitha ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి కంటే ముందు ఆయన ఇంట్లో వేరే సంబంధం గురించి మాట్లాడారని తెలిపారు. ఆ సమయంలో శ్రీదేవితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిశ్చయించారని చెప్పారు. ఇద్దరూ ఒకే కులానికి చెందినవారు కావడంతో ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఒత్తిడి చేసారట.

ఈ విషయం జీవితకు చెప్పినప్పుడు, “మీరు వేరే పెళ్లి చేసుకుంటే మీ ఇష్టం, కానీ నేను మాత్రం జీవితాంతం పెళ్లి చేసుకోను” అని ఆమె చెప్పిందట. ఆ మాట విని తాను చాలా ఆశ్చర్యపోయానని రాజశేఖర్ గుర్తుచేసుకున్నారు.

ఇంకా ఒక సరదా సంఘటనను కూడా ఆయన పంచుకున్నారు. తన ప్రేమ విషయం తెలియకుండా ఇంట్లో మరో అమ్మాయిని చూసారట. ఎవరు మంచిదో నిర్ణయించలేక, ఇద్దరినీ ఒకేసారి గుడికి రమ్మన్నారు. కానీ అక్కడికి వెళ్లాక ఆ ఇద్దరూ స్కూల్ ఫ్రెండ్స్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారని చెప్పారు. చివరకు జీవితతోనే ఆయన పెళ్లి జరిగింది.

తన కెరీర్ గురించి మాట్లాడుతూ, తాను డాక్టర్ కావాలని కుటుంబం కోరుకున్నా, నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి వచ్చానని చెప్పారు. అలాగే ‘చంటి’, ‘జెంటిల్ మెన్’ వంటి హిట్ సినిమాల అవకాశాలు మొదట తన దగ్గరకు వచ్చాయని తెలిపారు. కానీ ‘చంటి’ సినిమా హక్కులు తీసుకోవడానికి వెళ్తుండగా, అప్పటికే వెంకటేష్ Venkatesh తీసుకున్నారని చెప్పారు.

ఈ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు