అల్లు అర్జున్ పై హైకోర్టులో కేసు..!

ఏపీ ఎన్నికల ప్రచార సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా జనసమీకరణ చేశారంటూ బన్నీపై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆ కేసును కొట్టివేయాలని ఐకాన్‌స్టార్‌ పిటీషన్ వేశారు. తాజాగా హైకోర్టు అల్లు అర్జున్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. రేపే విచారణ జరగనుంది.

New Update
Allu Arjun: వయనాడ్‌ బాధితులకు అల్లు అర్జున్ సాయం.. రూ. 25 లక్షల విరాళం

allu arjun

Allu Arjun:  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ ఎన్నికల సమయంలో తన స్నేహితుడు, నంద్యాల  వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా అల్లు అర్జున్ అనుమతి లేకుండా  జనసమీకరణ చేశారనే ఆరోపణలతో ఆయన పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. దీని పై ఐకాన్ స్టార్ స్పందిస్తూ తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు. 

Also Read: Kiccha Sudeep: హీరో కిచ్చా సుదీప్ ఇంట విషాదం.. పవన్ కళ్యాణ్ ట్వీట్

బన్నీ పిటీషన్ స్వీకరించిన హై కోర్టు 

అయితే తాజాగా హై కోర్టు అల్లు అర్జున్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. బన్నీ పిటీషన్ పై రేపు విచారణ జరపనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇలా ఉంటే ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ శిల్పా రవికి సపోర్ట్ గా ప్రచారం చేయడం మెగా ఫ్యామిలీలో చిచ్చు రేపింది. అప్పటి నుంచి మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య మనస్పర్థలు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం  జరుగుతోంది. 

Also Read: సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం మరో 50 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో రష్మిక కథానాయికగా నటించగా.. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు. 

Also Read:  Bhargavi Nilayam: ఏడాది తర్వాత ఓటీటీలో టోవినో థామ‌స్ థ్రిల్లర్ 'భార్గ‌వి నిల‌యం' - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు