'గోదారి గట్టు మీద రామ చిలకవే' సాంగ్ వచ్చేసింది..రమణ గోగుల ఈజ్ బ్యాక్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. 'గోదారి గట్టు మీద' అంటూ సాగే ఈ పాటను రమణ గోగుల, మధుప్రియ కలిసి పాడారు. క్యాచీ లిరిక్స్ తో ఆకట్టుకునేలా ఉన్న ఈ పాటలో వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్ డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది. By Anil Kumar 03 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. 'గోదారి గట్టు మీద రామ చిలకవే' అంటూ సాగే ఈ పాటను ఒకప్పటి ఫేమస్ సింగర్ రమణ గోగులతో పాడించారు. సుమారు 18 ఏళ్ళ తర్వాత రమణ గోగుల.. వెంకటేష్ సినిమాకు పాట పాడటం విశేషం. అప్పట్లో వీరి కాంబోలో వచ్చిన ప్రేమంటే ఇదేరా, లక్ష్మీ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అందులోని సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మళ్ళీ ఇన్నేళ్లకు రమణ గోగుల గాత్రం వినిపించడంతో మ్యూజిక్ లవర్స్ ఈ సాంగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. Here's the song you’ve all been waiting for - #GodariGattu from our #SankranthikiVasthunam. ✨ This is my absolute favorite track from the album, and it’s guaranteed to get you dancing. 🤩— https://t.co/0RkoBtlGiF A #Bheemsceciroleo MusicalLyrics by @bhaskarabhatlaSung by… — Anil Ravipudi (@AnilRavipudi) December 3, 2024 Also Read : ఏపీలో ‘పుష్ప2’ టికెట్ ధరల పెంపు.. అక్కడ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే? అదిరిపోయే మెలోడీ.. ఎట్టకేలకు నేడు ఆయన పాడిన సాంగ్ కు సంబంధించి లిరికల్ వీడియో రిలీజ్ చేయగా.. ఈ సాంగ్ క్యాచీ లిరిక్స్ తో ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా రమణ గోగుల వాయిస్ ఈ పాటకు యాడ్ అవ్వడం మరింత ప్లస్ అయింది. తెలంగాణ ఫోక్ సింగర్ మధుప్రియ రమణ గోగులతో కలిసి ఈ పాట ఆలపించడం విశేషం. ఇక ఈ పాటలో వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్ ల డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. జనవరి 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read : 'పుష్ప2' లో ఆ సీన్ చూసి మైండ్ దొబ్బింది.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్ #venky-anil-3-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి