/rtv/media/media_files/2026/04/29/gayatri-gupta-2026-04-29-13-10-56.jpg)
Gayatri Gupta
Gayatri Gupta: టాలీవుడ్ నటి గాయత్రీ గుప్తా Gayatri Gupta మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె నటుడు శివాజీ Shivaji చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
గతంలో శివాజీ(Actor Shivaji) మహిళల డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ, చీర వంటి సాంప్రదాయ దుస్తులు ధరించడం మంచిదని, వెస్ట్రన్ దుస్తుల కంటే అవే గౌరవంగా ఉంటాయని అన్నట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలపై గాయత్రి గుప్తా తన అభిప్రాయం స్పష్టంగా చెప్పారు.
Also Read: "డార్లింగ్ 4K" రీ-రిలీజ్ విధ్వంసం! ఆ రికార్డులన్నీ లేపేసిన ప్రభాస్!
ఆమె మాట్లాడుతూ, “నేను ఏ దుస్తులు వేసుకోవాలి అనేది నా వ్యక్తిగత విషయం. ఎవరు చెప్పారనే కారణంగా నేను మారను. నాకు కంఫర్ట్‌గా అనిపించే దుస్తులే నేను ధరిస్తాను” అని తెలిపారు. అలాగే “మన దృష్టిలో ఎలా ఉంటే, మనకు ప్రపంచం కూడా అలా కనిపిస్తుంది. ఇతరులను విమర్శించేముందు మన ఆలోచనలను చూసుకోవాలి” అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు.
Also Read: ట్రిపుల్ రోల్ లో ప్రభాస్! కల్కి 2 క్రేజీ అప్‌డేట్
గాయత్రి గుప్తా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు రెండు వర్గాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెకు మద్దతు ఇస్తూ, డ్రెస్సింగ్ అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛ అని అంటున్నారు. మరికొందరు మాత్రం శివాజీ ఒక అభిప్రాయం మాత్రమే చెప్పారని, దానికి ఇంతగా స్పందించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ఈ విషయం మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
Follow Us