/rtv/media/media_files/2026/05/08/friday-ott-releases-2026-05-08-09-47-27.jpg)
Friday OTT Releases
Friday OTT Releases: ఈ వారం OTT ప్లాట్‌ఫామ్‌లలో యాక్షన్, కామెడీ, క్రైమ్, థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా ఇలా అన్ని రకాల కంటెంట్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. Netflix, Prime Video, JioHotstar వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ ప్రారంభించాయి.
స్పై థ్రిల్లర్‌ల నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ల వరకు ఈ వీకెండ్ బోర్ కొట్టకుండా చూసేంత కంటెంట్ అందుబాటులో ఉంది. మరి ఈ వారం ఏయే సినిమాలు, సిరీస్‌లు OTTలో వచ్చాయో ఇప్పుడు చూద్దాం.
Citadel Season 2 - Prime Video
ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్పై థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్ 2 రెండో సీజన్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మే 6 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సీజన్‌లో మేసన్ కేన్, నాడియా సిన్ పాత్రలు మరోసారి ప్రమాదకరమైన మిషన్‌లో కనిపిస్తాయి. ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్న “మాంటికోర్” అనే శక్తివంతమైన గ్రూప్‌ను ఆపడం ఈసారి వారి ప్రధాన లక్ష్యం. ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా Priyanka Chopra Jonas, Richard Madden, Stanley Tucci కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్, స్పై మిషన్స్, ట్విస్ట్‌లతో ఈ సీజన్ మరింత ఆసక్తిగా సాగుతుంది.
Also Read: మీ సీక్రెట్స్, 'పర్సనల్' చాటింగ్ మొత్తం అవుట్.? ఇన్‌స్టాగ్రామ్ సంచలన నిర్ణయం!
Vaazha 2: Biopic of a Billion Bros - JioHotstar
మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న Vaazha 2: Biopic of a Billion Bros ఇప్పుడు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. మే 8 నుంచి OTTలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాకు సవిన్ ఎస్.ఏ దర్శకత్వం వహించగా, విపిన్ దాస్ కథ అందించారు. ఫ్రెండ్స్ మధ్య బంధం, సరదా సంఘటనలు, ఎమోషనల్ సన్నివేశాలతో సినిమా సాగుతుంది. ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.
Dacoit: A Love Story - Prime Video
'డెకాయిట్' సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా మే 8 నుంచి OTT ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో అడివి శేష్ Adivi Sesh, మృణాల్ ఠాకూర్ Mrunal Thakur ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమ, రివేంజ్, యాక్షన్ అంశాలతో సినిమా సాగుతుంది. ఇంకా అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Remarkably Bright Creatures - Netflix
ఎమోషనల్ కథలు ఇష్టపడేవారికి Remarkably Bright Creatures ది బెస్ట్ సినిమా. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో మే 8 నుంచి అందుబాటులో ఉంది. ఈ మూవీ రచయిత Shelby Van Pelt రాసిన ప్రముఖ నవల ఆధారంగా రూపొందింది. భర్తను కోల్పోయిన టోవా సల్లివన్ అనే మహిళ జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. ఆమెకు “మార్సెలస్” అనే తెలివైన ఆక్టోపస్‌తో ఏర్పడే అనుబంధం కథలో ప్రధానంగా ఉంటుంది. ఈ చిత్రంలో Sally Field ప్రధాన పాత్ర పోషించగా, Lewis Pullman, Alfred Molina కూడా నటించారు.
Bharatanatyam 2 Mohiniyattam - Netflix
Bharatanatyam 2 Mohiniyattam కూడా ఈ వారం OTTలోకి వచ్చింది. ఈ మలయాళ డార్క్ కామెడీ థ్రిల్లర్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి భాగంలో ఉన్న కుటుంబ రహస్యాల కథనే ఈ సీక్వెల్ కొనసాగుతుంది. పాత దేవాలయానికి సంబంధించిన మోసాన్ని దాచిపెట్టడానికి కుటుంబం చేసే ప్రయత్నాలు, కొత్త సమస్యలు కథలో ఆసక్తి పెంచుతాయి. ఈ సినిమాలో సాయిజు కురుప్, సురాజ్ వెంజారమూడు, జగదీష్ ముఖ్య పాత్రల్లో నటించారు.
Lukkhe - Prime Video
చండీగఢ్ ర్యాప్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన క్రైమ్ డ్రామా సిరీస్ Lukkhe ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో సంగీత ప్రపంచంలోని పోటీలు, గ్యాంగ్ సమస్యలు, ఎదగాలనే కోరికల మధ్య జరిగే సంఘటనలు చూపించారు. రాశి ఖన్నా, కింగ్, పాలక్ తివారీ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. మ్యూజిక్, క్రైమ్, డ్రామా కలిపిన ఈ సిరీస్ యువతను ఆకట్టుకునేలా రూపొందించారు.
ఈ వారం OTTలో వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్ని రకాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని విడుదలయ్యాయి. యాక్షన్ ఇష్టపడేవారికి 'సిటాడెల్ 2', 'డెకాయిట్' ఫుల్ గా ఎంటర్టైన్ చేయనున్నాయి, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం Vaazha 2 చూడొచ్చు. ఎమోషనల్ డ్రామా కోసం Remarkably Bright Creatures, థ్రిల్లర్ కోసం Bharatanatyam 2 Mohiniyattam సినిమా థ్రిల్ అందించనుంది.
Follow Us