/rtv/media/media_files/2026/04/28/diesel-shortage-2026-04-28-06-57-03.jpg)
Diesel Shortage
Diesel Shortage: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇంధన కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా డీజిల్ అందుబాటులో లేకపోవడంతో సినిమాల షూటింగ్‌లపై ప్రభావం పడుతోంది. సోమవారం అనేక చిత్రాల షూటింగ్‌లు అంతరాయం(Tollywood Shootings Bandh) కలిగాయి. సినిమా షూటింగ్‌లకు జనరేటర్లు చాలా అవసరం. లైట్లు, కెమెరాలు, కూలర్లు వంటి పరికరాలు పనిచేయడానికి ఎక్కువ మొత్తంలో డీజిల్ కావాలి. కానీ డీజిల్ దొరకకపోవడంతో కొన్ని షూటింగ్‌లు ఆగిపోయాయి. కొన్ని యూనిట్‌లు బ్లాక్ మార్కెట్‌లో డీజిల్ కొనుగోలు చేసి షూటింగ్ కొనసాగించడానికి ప్రయత్నించగా, మరికొన్ని పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే పరిస్థితి మంగళవారం కూడా కొనసాగొచ్చని భావిస్తున్నారు.
Follow Us