/rtv/media/media_files/2025/02/20/5tvqMa3hvg8zlsRiah5l.jpg)
OTT Photograph: (OTT)
ఈ వారం ఓటీటీ, థియేటర్ ప్రేక్షకులను అలరించేందుకు అదిరిపోయే సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ పోటీకి సిద్ధమయ్యాయి. ఈ వారం ఓటీటీ, థియేటర్ సినిమాల ఫుల్ లిస్ట్ ఇక్కడ చూద్దాం..
థియేటర్ సినిమాలు
దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'కాంత'ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. 1950ల నాటి కాలాన్ని ప్రతిబింబిస్తూ మద్రాస్ నేపథ్యంలో దీనిని రూపొందించారు. రానా దగ్గుబాటి, దుల్కర్ కలిసి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే మూవీ ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాలు విడుదలవగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
నాగార్జున- రామ్ గోపాల్ వర్మ కల్ట్ క్లాసిక్ 'శివ' చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దివగంత నటుడు, తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి వేడుకల సందర్భంగా నవంబర్ 14న 'శివ' చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. 4k డాల్బీ అట్మాస్ వెర్షన్ లో దీనిని విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో అమల, నాగార్జున జంటగా నటించారు.
చాందిని చౌదరీ- విక్రాంత్ జంటగా నటించిన 'సంతాన ప్రాప్తిరస్తూ' చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది. నేటి తరం ఎదుర్కుంటున్న సంతాన లేమి సమస్య ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్, అభినవ్ గోమటం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఓటీటీ సినిమాలు
అమెజాన్ ప్రైమ్
- ప్లే డేట్: నవంబరు 12
- జియో హాట్ స్టార్
- జాలీ ఎల్‌ఎల్‌బీ : నవంబరు 14
నెట్‌ఫ్లిక్స్
- మెరైన్స్: నవంబరు 10
- దిల్లీ క్రైమ్ 3: నవంబరు 13
- డ్యూడ్ : నవంబరు 14
జీ5
- మనోరమా మ్యాక్స్
- కప్లింగ్: నవంబరు 14
- ఇన్‌స్పెక్షన్ బంగ్లా: నవంబరు 14
Follow Us