Sai Abhyankar: 'డ్యూడ్' మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్‌ డిమాండ్ మాములుగా లేదుగా..! నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవే..!

యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్, ‘డ్యూడ్’ సినిమా ప్రారంభంలో విమర్శలకు గురైనప్పటికీ, OTT విడుదల తర్వాత సంగీతం, BGM ప్రేక్షకులను కట్టిపడేశాయి. ‘ఊరం బ్లడ్’ సాంగ్ ఫుల్ వైరల్ అయ్యి 100 మిలియన్ వ్యూస్ దాటింది.

New Update
Sai Abhyankar

Sai Abhyankar

Sai Abhyankar: దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలలో ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లలో   ఎక్కువగా వినిపిస్తున్న పేరు సాయి అభ్యంకర్. ఇంకా డైరెక్ట్‌గా పెద్ద సినిమాలతో రాకముందే అల్లు అర్జున్- అట్లీ సినిమా, సూర్య ‘కరుప్పు’, కార్తి నటిస్తున్న ‘మార్షల్’ వంటి భారీ ప్రాజెక్టులు ఆయన చేతికి రావడంతో అందరి దృష్టి ఆయనపై పడింది.

సాయి అభ్యంకర్‌కి విడుదలైన తొలి సినిమా ‘బల్టీ’, కానీ అందరూ ఎక్కువగా ఎదురు చూసింది ప్రదీప్ రంగనాథన్ మూవీ ‘డ్యూడ్’(Dude Songs). ఈ చిత్రంలోని మొదటి సింగిల్ ‘ఊరం బ్లడ్’ విడుదలైన వెంటనే పెద్ద సంఖ్యలో ట్రోల్‌లు వచ్చాయి. చాలా మంది ఈ పాటను, సాయి సంగీతాన్ని మరీ ఎక్కువగా హైప్ చేసినట్టు విమర్శించారు. అంతేకాదు, ఆయన భారీ సినిమాలకు సరిపోతారా? అంటూ సందేహాలు వ్యక్తం చేశారు.

అయితే సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత పరిస్థితి కొంచెం మారింది. చాలా మంది ప్రేక్షకులు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను, పాటలను మెచ్చుకోవడం ప్రారంభించారు. “స్లో పాయిజన్” లా ఆలస్యంగా బాగా నచ్చే సంగీతమని పొగిడారు.

కానీ OTT లో సినిమాను విడుదల చేసిన తర్వాత వచ్చింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో 'ఊరం బ్లడ్' ఒరిజినల్ స్కోర్‌తో వందలాది ఎడిట్లు రావడం ప్రారంభమయ్యాయి. ముందుగా ట్రోల్ చేసినవాళ్లే ఈసారి పొగడ్తలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ సంగీతానికి ఉన్న యూనివర్సల్ వైబ్‌ను అందరూ గుర్తించడం ప్రారంభించారు.

ప్రత్యేకంగా ఇంటర్వల్ సీన్‌లో వినిపించిన రీహాష్ BGM OTT ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అయింది. అది ఇతర సినిమాల సీన్లతో కూడా సింక్ అయ్యేలా ఉండటంతో, నెటిజన్లు ఆ స్కోర్‌ను వేరే వీడియోలకు పెట్టి షేర్ చేస్తూ వైరల్ చేశారు.

దీంతో 'ఊరం బ్లడ్' వీడియో సాంగ్ మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దాటింది. మొదట విమర్శలతో ఎదురైన పాట ఇప్పుడు పెద్ద విజయంగా మారింది.

ఈ అనుకోని స్పందనతో సాయి అభ్యంకర్‌కు మంచి ఉత్సాహం వచ్చింది. మొదట విమర్శలు ఎంత వచ్చినా, ఇప్పుడు అదే సంగీతం ఆయనను ట్రెండ్‌సెట్టర్‌గా మార్చడాన్ని అభిమానులు కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు.

ఇప్పుడు ఆయన తదుపరి భారీ సినిమాలపై మరింత ఆశలు పెరిగాయి. ప్రేక్షకులు కూడా సాయి అభ్యంకర్ నుంచి ఇంకా ఎలాంటి కొత్త సంగీతం రానుందో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు