/rtv/media/media_files/2025/11/10/dude-ott-2025-11-10-10-29-01.jpg)
Dude 2
Dude 2: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కథ ఉన్న సినిమాలను ఆదరిస్తారు. హీరో ఎవరు, సినిమా ఏ భాషలో వచ్చింది అనే విషయాల కంటే కంటెంట్ బాగుంటే చాలు పెద్ద విజయాన్ని అందిస్తారు. అందుకే తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) కూడా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
‘లవ్ టుడే’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్, తర్వాత వచ్చిన ‘డ్రాగన్’ సినిమాతో కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఆయనకు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది.
DUDE 2 ON CARDS
DUDE 2 ON CARDS 😵
— Movies4u Official (@Movies4u_Officl) June 9, 2026
"I have already pitched idea for #DUDE2 to #PradeepRanganathan. If it works, we will start working on the sequel."
- Keerthiswaran, #Dude Director pic.twitter.com/9FAsxDGkJ9
ఆ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి ప్రదీప్ చేసిన సినిమా ‘డ్యూడ్’. కొత్త దర్శకుడు కీర్తిస్వరన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ నటి మమితా బైజు హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
సినిమా హిట్ అయినప్పటి నుంచి ‘డ్యూడ్’కు సీక్వెల్ వస్తుందా లేదా అనే ప్రశ్న అభిమానుల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ఆ విషయంపై దర్శకుడు కీర్తిస్వరన్ స్పందించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తాను ఇటీవల ప్రదీప్ రంగనాథన్‌తో ఒక కొత్త ఆలోచనను చెప్పానని తెలిపారు. ఆ ఐడియా వినగానే ‘డ్యూడ్’ సినిమాలో ఉన్న అసలు ఫీల్, ఎనర్జీ ఇందులో కూడా కనిపించిందని ఇద్దరికీ అనిపించిందన్నారు.
అంతేకాకుండా ఆ ఆలోచన పూర్తిగా సెట్ అయితే దానిని ‘డ్యూడ్ 2’గా తెరకెక్కించే అవకాశం ఉందని చెప్పారు. సీక్వెల్ వస్తే అది మొదటి భాగానికి కొనసాగింపుగా ఉండే కథతోనే రూపొందుతుందని కూడా ఆయన వెల్లడించారు.
మొదటి భాగం ద్వారా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిన ‘డ్యూడ్’ ఇప్పుడు రెండో భాగంగా వచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో అభిమానులు ఆనందపడుతున్నారు. దర్శకుడు చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ‘డ్యూడ్ 2’పై అంచనాలు మరింత పెరిగాయి.
Follow Us