/rtv/media/media_files/2026/05/27/mamitha-baiju-2026-05-27-16-04-53.jpg)
Mamitha Baiju
Mamitha Baiju: సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ (DSP) హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘ఎల్లమ్మ’పై మంచి ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ సినిమాలో హీరోయిన్ పై మేకర్స్ చాలా కాలంగా చర్చలు జరుపుతున్నారు. మొదటగా సాయి పల్లవి పేరు వినిపించింది. ఆ తర్వాత కీర్తి సురేష్‌తో కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఇటీవల మృణాల్ ఠాకూర్ పేరు కూడా హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మలయాళ నటి మమితా బైజు పేరు కూడా మెయిన్ హీరోయిన్‌గా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
మమితా బైజు ఇటీవల ‘ప్రేమలు’, డ్యూడ్ అనే రొమాంటిక్ కామెడీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలు తెలుగు సహా ఇతర భాషల్లో కూడా మంచి విజయాన్ని సాధించాయి. అంతేకాదు, ఆమె త్వరలో ధనుష్ 54వ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది.
‘ఎల్లమ్మ’ సినిమాను దర్శకుడు వేణు వెల్దండి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో DSP నటుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ పనిచేయనున్నారు. అంటే ఆయన ఈ ప్రాజెక్ట్‌కు డబుల్ రోల్‌లో పనిచేస్తున్నారు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక బృందం సెలక్షన్ దశలో ఉంది. హీరోయిన్ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Follow Us