/rtv/media/media_files/2026/05/27/disha-mouni-2026-05-27-21-12-12.jpg)
Disha Mouni
Disha Mouni: బాలీవుడ్ గ్లామర్ స్టార్స్ దిశా పటానీ, మౌనీ రాయ్ మధ్య ఉన్న స్నేహంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరూ లెస్బియన్స్ అని కూడా కొన్ని ప్రచారాలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
వీరిద్దరూ తరచూ కలిసి విదేశీ టూర్లకు వెళ్లడం, పార్టీల్లో చాలా క్లోజ్‌గా కనిపించడం, అలాగే కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి.
ఇటీవల మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానీతో కలిసి ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు ఆమె “నా లిటిల్ సిస్టర్‌ను చాలా మిస్ అవుతున్నాను” అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీని ద్వారా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం మంచి స్నేహమేనని చెప్పే ప్రయత్నం చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
అయితే ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే మౌనీ రాయ్ దానిని తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించడం ఇప్పుడు మరింత చర్చకు కారణమైంది. ఈ పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారన్న దానిపై స్పష్టత లేకపోవడంతో నెటిజన్లు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.
నెగిటివ్ కామెంట్స్ వల్లే తీసేసారా? లేక పొరపాటున పెట్టిన క్యాప్షన్ కారణంగా డిలీట్ చేశారా? అన్న అనుమానాలు బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.
ఏదేమైనా, ఈ ఇద్దరు గ్లామర్ స్టార్స్ ఎన్ని క్లారిటీలు ఇచ్చినా, సోషల్ మీడియాలో మాత్రం వాళ్ళ గురించి రూమర్స్ ఆగడం లేదు.
Follow Us