Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పిన దర్శకుడు హరీష్ శంకర్!

సోషల్ మీడియాలో ఒక ట్వీట్‌ను పూర్తిగా చదవకుండా “తధాస్తు” అని రిప్లై ఇవ్వడంతో దర్శకుడు హరీష్ శంకర్ వివాదంలోకి వెళ్లారు. దానిపై మహేష్ అభిమానులు ఫుల్ ఫైర్ అయ్యారు. వెంటనే ట్వీట్ ను డిలీట్ చేసిన హరీష్, మహేష్ బాబుపై తనకు గౌరవం ఉందని చెప్పి అభిమానులకు క్షమాపణలు తెలిపారు.

New Update
Harish Shankar

Harish Shankar

Harish Shankar: దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో జరిగిన ఒక చిన్న సంఘటన పెద్ద చర్చకు దారి తీసింది.

ఇటీవల సోషల్ మీడియాలో ఒక అభిమాని పెట్టిన ట్వీట్‌కు హరీష్ శంకర్ స్పందించడం ఈ వివాదానికి కారణమైంది. ఆ ట్వీట్‌లో మహేష్ బాబు సినిమా రికార్డుల గురించి వ్యంగ్యంగా మాట్లాడినట్టుగా ఉన్న ఒక కామెంట్  కు  హరీష్ శంకర్ ఆ ట్వీట్‌ను పూర్తిగా చదవకుండా “తధాస్తు” అని రిప్లై ఇచ్చారు.

ఈ ట్వీట్ కొన్ని క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మహేష్ బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అలాంటి ట్వీట్‌కు స్పందించారని దర్శకుడిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.

ఈ విషయం పెద్దదవుతున్నట్లు గుర్తించిన హరీష్ శంకర్ వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. తర్వాత జరిగిన విషయాల గురించి స్పష్టత ఇవ్వడానికి సోషల్ మీడియాలో ఒక క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేశారు.

అందులో ఆయన ఇలా తెలిపారు. “నిన్న నేను చాలా బిజీగా ఉన్నాను, సెన్సార్ బోర్డు అధికారులతో మీటింగ్ జరిగింది. అలాగే పెదమ్మ గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నాను. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సాంగ్ ప్రోమో చివరి చెక్‌లు, ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పూర్తిచేశాను. తరువాత తమన్ స్టూడియోకు వెళ్లి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు చూసాను” అని చెప్పారు.

Also Read: దుమ్మురేపుతున్న "మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ టీమ్ ప్రమోషన్స్".. ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా చూసుండరు!

ఆ సమయంలో చాలా మంది జర్నలిస్టులు, అభిమానులు, స్నేహితులు పంపిన మెసేజ్ లకు ఒకేసారి రిప్లై ఇస్తున్నానని ఆయన తెలిపారు. అదే సమయంలో ఒక ట్వీట్‌ను పూర్తిగా చదవకుండా కోట్ చేసి రిప్లై ఇచ్చానని చెప్పారు.

తన టీమ్ వెంటనే ఆ విషయం గమనించి ట్వీట్‌ను పూర్తిగా చూడమని చెప్పిందని, వెంటనే అది తప్పుగా అర్థం అయ్యేలా ఉందని తెలుసుకుని డిలీట్ చేశానని హరీష్ శంకర్ వివరించారు.

అలాగే మహేష్ బాబు పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని కూడా స్పష్టం చేశారు. “సూపర్ స్టార్ మహేష్ బాబు గారిపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన పేరుతో ఇంకా చాలా రికార్డులు రావాలని నేను ఎప్పుడూ భావిస్తాను. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ ట్వీట్ చేయలేదు” అని అన్నారు.

అయితే తన చర్య వల్ల ఎవరికైనా బాధ కలిగితే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని కూడా చెప్పారు. సినిమా విడుదలకు ముందు అభిమానుల మద్దతు ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

“ఒక సినిమా విజయవంతం కావాలంటే అన్ని హీరోల అభిమానుల ప్రేమ అవసరం. నా సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్న సమయంలో నేను కావాలని ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయను” అని ఆయన స్పష్టం చేశారు.

చివరగా మరోసారి క్షమాపణలు చెబుతూ తన సినిమాకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.

ఇలా హరీష్ శంకర్ ఇచ్చిన వివరణతో ఈ వివాదం కొత్త క్లియర్ అయ్యింది. ప్రస్తుతం మార్చి 19న విడుదలకు సిద్ధమవుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా చివరి దశ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు