Atlee Multi Starrer: అట్లీ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్..! ఈ దెబ్బతో రాజమౌళి అవుట్..

‘జవాన్’తో సూపర్ సక్సెస్ సాధించిన డైరెక్టర్ అట్లీ తాజాగా సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిజమైతే, ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదొక సంచలనం అనే చెప్పాలి.

New Update
atlee multi starrer

atlee multi starrer

Atlee Multi Starrer: డైరెక్టర్ అట్లీ రొటీన్ సినిమాలు మాత్రమే చేస్తాడని విమర్శించే వాళ్ళు చాలామందే ఉన్నారు. పాత సినిమాల కథలను అటు ఇటు మార్చి కొత్తగా ప్రెజెంట్ చేస్తాడని ఇండస్ట్రీలో టాక్.  కానీ, జవాన్ తో అట్లీ  బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని తొలి సినిమా ‘రాజా రాణి’ నుంచి తాజాగా హిందీలో షారుఖ్ ఖాన్‌తో రూపొందించిన ‘జవాన్’ వరకు అన్ని సినిమాలూ బ్లాక్ బస్టర్లే. అయితే, ‘జవాన్’ రీలీజ్ అయిన ఏడాది అయిపోతున్నప్పటికీ, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు.

Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో తొక్కిసలాటతో స్పెషల్ రైళ్లు రద్దు.. రైల్వేశాఖ క్లారిటీ!

అట్లీ మెగా మల్టీస్టారర్..

అట్లీ తన నాల్గవ సినిమాకు హీరో ఎవరనేదాని గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. కానీ వాటిలో ఏదీ నిజం కాలేదు. ఇప్పుడు, కొత్తగా ఓ మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడని వార్తలు జోరందుకున్నాయి. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసి నటించబోతున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ ఇద్దరు సూపర్ స్టార్‌లను ఒకే సినిమాతో అట్లీ డైరెక్టన్ లో వస్తున్నారు అని తెలిసి ఫాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 

Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

సల్మాన్ ఖాన్‌కి మల్టీస్టారర్లలో చేసే అవకాశాలు చాలా తక్కువ. తక్కువ సందర్భాలలోనే ఆయన క్యామియో పాత్రలలో కనిపిస్తుంటారు. అలాగే, రజినీకాంత్ కూడా చాలా కాలంగా సోలో హీరోగా మాత్రమే సినిమాలు చేస్తున్నారు, ఇలాంటి పరిస్థితిలో, ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఒక సినిమా చేయడానికి ఒప్పుకోవడం అంటే సినిమా పరిశ్రమలోనే పెద్ద విషయం. ఈ వార్త నిజమైతే, ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద సినిమాలుగా ఈ మూవీ మారే  అవకాశాలు ఉన్నాయి. అట్లీ ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలో ఏం ప్రకటిస్తారో చూడాలి.

Also Read: Mazaka Movie: రోడ్లపై సందీప్ కిషన్, రావు రమేష్ డాన్సులు.. 'బ్యాచిలర్స్ ఆంథెమ్' వచ్చేసింది !

Also Read: TG, AP MLC Elections: తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్.. వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు