Dhurandhar VS Ustaad: రికార్డులు తిరగరాస్తున్న “ధురంధర్ 2”.. మరి "ఉస్తాద్" సంగతేంటి..?

“ధురంధర్ 2” దేశవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తుండగా, పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా రన్ అవుతోంది. మొదట మిక్స్ టాక్ వచ్చినప్పటికీ వీకెండ్ బూస్ట్ తో కలెక్షన్లు బాగున్నాయి.

New Update
Ustaad vs Dhurandhar 2

Dhurandhar VS Ustaad

Dhurandhar VS Ustaad: “ధురంధర్ 2” బాక్సాఫీస్‌లో రికార్డులు తిరగరాస్తూ దేశవ్యాప్తంగా హల్‌చల్ సృష్టిస్తూనే ఉంది. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్‌లు కూడా ప్రశంసలు తెలిపారు, ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత పెంచుతున్నారు. తెలుగు వెర్షన్ రిలీజ్ కొద్దిరోజులు ఆలస్యమైనందున, తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు హిందీ వెర్షన్ అయినా సరే చుడానికి థియేటర్లకు వెళ్ళ్తున్నారు.

ఇక, మరో వైపు పవన్ కళ్యాణ్ నటించిన “ఉస్తాద్ భగత్ సింగ్” పరిస్థితి ఏలా ఉందంటే, మొదట మిక్స్ టాక్ వచ్చినప్పటికీ సినిమా స్థిరంగా ప్రదర్శన ఇస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్టార్ ఫ్యాక్టర్ వల్ల సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

రెండవ రోజున కొద్దిగా కలెక్షన్స్ తగ్గాయి, కానీ శనివారం, వీకెండ్, రమజాన్ సెలవులు వల్ల మూవీకి మంచి బూస్ట్ లభించింది. మేటినీ షోలు కూడా థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి, ఈవెనింగ్ షోలు కూడా పెద్ద నగరాల్లో ఫుల్ హౌస్ అవుతున్నాయి.

వేరువేరు ప్రాంతాల్లో “ధురంధర్ 2” ఇంకా ఆధిపత్యం చూపిస్తూనే ఉన్నా, “ఉస్తాద్ భగత్ సింగ్” మాత్రం ఫ్యాన్స్ సపోర్ట్ తో స్థిరంగా ఆడుతోంది. విదేశాల్లో, అయితే ధురంధర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది, ఉస్తాద్ కు కలెక్షన్స్ ఎక్కువ ఆశించినంతగా రావడం లేదు.

మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో సినిమా తగిన స్థాయిలో రన్ అవుతోంది. “ఉస్తాద్ భగత్ సింగ్” భారీ హైప్ లేకుండా,  ఆడియన్స్ అంచనాలు లేకుండా రిలీజ్ కావడం, సినిమా పై పెద్ద నిరాశను తప్పించగలిగింది. అయితే మరి సోమవారం నుండి ఉస్తాద్ ఎలా ఆడుతుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు