Dhurandhar: The Revenge: "ధురంధర్: ది రివెంజ్" రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

రణవీర్ సింగ్ హీరోగా నటించిన “ధురంధర్: ది రివెంజ్” దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధిస్తోంది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.501 కోట్ల కలెక్షన్లను దాటింది. సాంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.

New Update
Dhurandhar: The Revenge

Dhurandhar: The Revenge

Dhurandhar: The Revenge: రణవీర్ సింగ్ హీరోగా నటించిన “ధురంధర్: ది రివెంజ్” సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తోంది. ముందు భాగం విజయాన్ని కొనసాగిస్తూ,రణవీర్ సింగ్ పవర్ఫుల్ నటన, ఆదిత్య ధర్ డైరెక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా దేశవ్యాప్తంగా, అనేక భాషల్లో ప్రేక్షకులను అలరిస్తోంది.

సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అద్భుతమైన కలెక్షన్లుగా మారింది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.501 కోట్ల వసూళ్లను దాటింది. ఈ వేగం, సినిమా రికార్డ్ బ్రేకింగ్ రన్ మొదలు మాత్రమే అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

సాంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేది, డానిష్ పాండూర్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించడం సినిమాకు అదనపు ఆకర్షణ ఇచ్చింది. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ కలిసి నిర్మించిన ఈ చిత్రం రానున్న రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు