/rtv/media/media_files/2026/05/22/dhurandhar-ott-2026-05-22-09-29-52.jpg)
Dhurandhar OTT
Dhurandhar OTT: ధురంధర్ Dhurandhar యాక్షన్ ఫ్రాంచైజ్ మరోసారి OTTలో హాట్ టాపిక్‌గా మారింది. రణ్ వీర్ సింగ్ Ranveer Singh నటన, ఆదిత్య ధార్ Aditya Dhar దర్శకత్వంతో భారీ విజయాన్ని సాధించిన ఈ సిరీస్‌లో మొదటి భాగం ఇప్పుడు కొత్త వెర్షన్‌లో డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో విడుదలైంది.
తాజాగా ఈ సినిమా అన్‌సెన్సర్డ్ వెర్షన్‌గా Netflix, JioHotstar లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కొత్త వెర్షన్‌లో మ్యూట్ చేసిన బీప్ సౌండ్స్ లేకుండా ఒరిజినల్ డైలాగ్స్ వినిపిస్తాయి. దీంతో సినిమా మరింత రా, రియలిస్టిక్ అనుభూతిని ఇస్తోంది. అయితే సినిమా రన్‌టైమ్, సీన్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని సమాచారం. ఈ వెర్షన్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.
ఇక విదేశాల్లో Dhurandhar: The Revenge అన్‌కట్ వెర్షన్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది. కానీ భారతదేశ ప్రేక్షకులకు ఈ సీక్వెల్ OTT విడుదల కోసం ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఇండియాలో సెన్సార్డ్ వెర్షన్‌ను జూన్ 4, 2026న JioHotstarలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఫ్రాంచైజ్ డిజిటల్ రిలీజ్‌కు సంబంధించిన మరిన్ని అప్డేట్లు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Follow Us