Dhurandhar Collections: బాక్సాఫీస్‌పై 'ధురంధర్' దండయాత్ర.. 1100 కోట్ల మైలురాయి దాటిన రివెంజ్!

ధురంధర్: ది రివెంజ్, రణ్ వీర్ సింగ్ హీరోగా భారీ విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా ₹1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇండియాలోనే ₹800 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది.

New Update
Dhurandhar Collections

Dhurandhar Collections

Dhurandhar Collections: ధురంధర్: ది రివెంజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రణ్ వీర్ సింగ్ Ranveer Singh హీరోగా వచ్చిన ఈ చిత్రం ఇండియాలోనే రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. నెట్ కలెక్షన్లు రూ.690 కోట్లకు చేరగా, అందులో హిందీ వెర్షన్ నుంచే రూ.650 కోట్లు వచ్చాయి. ఇతర భాషల నుంచి మరో రూ.40 కోట్లు వచ్చాయి. విదేశాల్లో కూడా ఈ సినిమా రూ.270 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్ల మార్క్ దాటింది. ఇది చాలా వేగంగా ఈ రికార్డు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది.

ఈ సినిమాను ఆదిత్య ధార్ Aditya Dhar తెరకెక్కించగా, జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ నిర్మించాయి. ఇందులో సంజయ్ దత్ Sanjay Dutt, అర్జున్ రాంపాల్ Arjun Rampal, ఆర్. మాధవన్ R. Madhavan తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

Yami Gautam

మార్చి 19న విడుదలైన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథ, యాక్షన్, నటనతో పాటు చిన్న సర్ప్రైజ్‌గా Yami Gautam చేసిన క్యామియో కూడా హైలైట్ అయింది. సినిమాలో ఆమె నర్స్ పాత్రలో కనిపిస్తూ, పాకిస్తాన్‌లో అండర్‌కవర్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఆమె పాత్ర పేరు “షాజియా బానో”గా చూపించారు.

ఇటీవల యామి గౌతమ్ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన సీన్ వచ్చినప్పుడు సిగ్గుపడుతూ స్పందించిన ఆమె రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంది.

బాక్సాఫీస్ విషయానికి వస్తే, ఈ సినిమా మొదటి వారం లోనే భారీ వసూళ్లు సాధించింది. విడుదల రోజునే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ప్రస్తుతం మంచి వసూళ్లతో కొనసాగుతుంది. రెండో వారం లోకి వచ్చిన తర్వాత కూడా సినిమా స్టేబుల్‌గా కలెక్షన్లు తెచ్చుకుంటోంది.

మొత్తానికి, ‘ధురంధర్’ మొదటి భాగం తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ అన్ని అంచనాలను మించి భారీ హిట్‌గా నిలిచింది. యాక్షన్, కథ, నటన అన్ని  కలిసి ఈ సినిమాను పెద్ద సక్సెస్‌గా మార్చాయి.

Advertisment
తాజా కథనాలు