/rtv/media/media_files/2026/05/28/cm-ntr-2026-05-28-15-07-08.jpg)
CM NTR
CM NTR: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు,తెలుగు ప్రజల ఆరాధ్య దేవుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈరోజు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఉదయాన్నే ఘాట్‌కు వెళ్లి తన తాతయ్యకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఘాట్ వద్ద భారీగా చేరిన అభిమానులు “CM NTR” అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఏడాది ఈ నినాదాలు వినిపించడం సాధారణమే అయినా, ఈసారి అవి మరింత గట్టిగా వినిపించాయి. తమిళనాట నటుడు విజయ్ రాజకీయాల్లో సాధించిన విజయాన్ని చూసి కొంతమంది అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
#JrNTR pays tribute to NTR at NTR Ghat. pic.twitter.com/sIL0NSEWel
— The Telugu Daily (@TheTeluguDaily_) May 28, 2026
గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్థాయికి చేరాలన్న ప్రయత్నాలు పూర్తిగా విజయవంతం కాలేదు. దీంతో సినీ నటులకు రాజకీయాలు సరిపోవు అనే అభిప్రాయం కూడా కొంతమందిలో ఏర్పడింది. అయితే విజయ్ విజయం ఆ ఆలోచనను కొంతమేర మార్చిందని అభిమానులు అంటున్నారు.
అయితే తమిళనాడు రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండూ వేర్వేరు పరిస్థితుల్లో ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడ AIADMK నాయకత్వ సమస్యలు, అలాగే బీజేపీతో పొత్తు కారణంగా ప్రజల్లో అసంతృప్తి ఉండటం వల్ల TVK కి అనుకూల పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయం ఉంది.
ఇలాంటి పరిస్థితిని చూసి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ముఖ్యమంత్రి అవుతారని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇది వాస్తవానికి దూరమైన ఆలోచనగా పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీకి ఇప్పటికే బలమైన నాయకత్వం ఉందని, నారా లోకేష్ పార్టీ భవిష్యత్ నాయకుడిగా స్థిరంగా ఎదుగుతున్నారని అంటున్నారు.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారని, పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌గా ఎదగడమే ఆయన లక్ష్యమని సమాచారం. అందువల్ల ఆయన రాజకీయాల్లోకి రావడం లేదా టీడీపీ బాధ్యతలు చేపట్టడం వంటి ఊహాగానాలకు ప్రస్తుతం ఆధారం లేదని చెబుతున్నారు.
మొత్తం మీద “CM NTR” నినాదాలు ప్రతి సంవత్సరం వినిపిస్తున్నా, అవి అభిమానుల ఎమోషన్స్ తప్ప వాస్తవ రాజకీయ పరిస్థితులకు దగ్గరగా లేవని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Follow Us