నెత్తుటి పిడికిలి.. చిరంజీవి, శ్రీకాంత ఓదెల సినిమా పోస్టర్ వైరల్ 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. చిరంజీవి, శ్రీకాంత్ పిడికిలి బిగించిన స్టిల్ ను షేర్ చేశారు. By Archana 04 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update chiranjeevi- Sreekanth odela షేర్ చేయండి chiranjeevi- Sreekanth odela: గత కొన్ని రోజులుగా 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. నెత్తుటి చేతులతో మెగాస్టార్ తో కలిసి పిడికిలి బిగించిన ఫొటోను షేర్ చేశాడు. #చిరు శ్రీకాంత్ సినిమా.. హింసాత్మకంగా ఉండబోతుంది అంటూ ట్వీట్ చేశారు. ఈ ఒక్క స్టిల్ తో సినిమా పై అంచనాలను పెంచేశాడు. త్వరలోనే చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. 'దసరా' లాంటి మాస్ జాతరతో బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన శ్రీకాంత్.. మెగాస్టార్ తో చేతులు కలపడం ఆసక్తికరంగా మారింది. Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? ప్రస్తుతం 'విశ్వంభర' మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత 'విశ్వంభర' సినిమాతో బిజీగా ఉన్నాడు. మల్లాడి వసిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ లో 'విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు. ప్రశ్నను పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది. విర్ర వీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహా యుద్దాన్ని తీసుకొస్తుంది'.. వంటి అంచనాలను పెంచేశాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ఇందులో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. Good morning.#ChiruOdelaCinema will be VEHEMENTLY VIOLENT.#FANBOYTHANDAVAM 🔥 pic.twitter.com/fKkqOBLmmm — Srikanth Odela (@odela_srikanth) December 4, 2024 Unpredictable wild combination.❤️🔥 Wishing the entire team of #ChiruOdelaCinema all the best@KChiruTweets Garu @odela_srikanth @NameisNani @SLVCinemasOffl @UnanimousProd@sudhakarcheruk5 pic.twitter.com/AAH3821R89 — Ram Charan (@AlwaysRamCharan) December 4, 2024 Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! Also Read: Pawan Kalyan: మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. పవన్ నిర్ణయంతో అంతా అయోమయం? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి