/rtv/media/media_files/2025/11/21/chiranjeevi-2025-11-21-15-53-43.jpg)
Chiranjeevi
Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాల్లో ‘కోదమసింహం’(Kodama Simham) ఒకటి. కె. మురళి మొహనరావు దర్శకత్వంలో, కైకాల నాగేశ్వరరావు నిర్మించిన ఈ వెస్ట్రన్ యాక్షన్ డ్రామా 35 ఏళ్ల తర్వాత మళ్లీ నేడు థియేటర్లలోకి వచ్చి అభిమానుల్లో పాత జ్ఞాపకాలు నింపుతోంది.
Chiranjeevi Kodama Simham Re Release
రీ-రిలీజ్ హంగామాలో, చిత్రానికి సంబంధించిన ఒక పాత అరుదైన ఫోటో సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. సినిమాకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకలో సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో రజినీకాంత్ గారు చిరంజీవికి 100 డేస్ శీల్డ్ అందిస్తున్న ఫోటో మళ్లీ వైరల్ అవ్వడంతో అభిమానులు ఆ ప్రత్యేక క్షణాన్ని మళ్లీ గుర్తుతెచ్చుకొని సంబరపడుతున్నారు. ఇద్దరు లెజెండ్స్ మధ్య ఉన్న గౌరవం, ప్రేమ ఆ ఒకే ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.
/rtv/media/post_attachments/73ffef23-6a6.png)
అప్పుడు ‘కోదమసింహం’ 20 సెంటర్లలో 100 రోజులు ఆడడం ఆ రోజుల్లో పెద్ద రికార్డ్. ఈ విజయాన్ని అభిమానులు ఇప్పటికి గర్వంగా గుర్తుచేసుకుంటున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, రాధా, కైకాల సత్యనారాయణ, సుధాకర్, వాణి విష్ణునాథ్, అల్లు రామలింగయ్య, టైగర్ ప్రభాకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రామా ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి రాజ-కోటి ఇచ్చిన సంగీతం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఆ పాటలు ఇంకా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.
ఇంకో విశేషం ఏమిటంటే- చిరంజీవి ఇటీవల కోదమసింహం లుక్‌ను 35 ఏళ్ల తర్వాత మళ్లీ రీక్రియేట్ చేశారు. ఆ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే స్టైల్, అదే దర్పం, అదే ఎనర్జీ ఇప్పటికీ మెగాస్టార్‌లో ఉందని అభిమానులు ఆశ్చర్యపోయారు. కాలం మారిపోయినా, చిరంజీవి లెజెండరీ ఇమేజ్ మాత్రం అలాగే కొనసాగుతుందని మరోసారి నిరూపించారు మన మెగాస్టార్.
నవంబర్ 21న గ్రాండ్ రీ-రిలీజ్ అవుతుండడంతో పాత అభిమానులు మాత్రమే కాదు, కొత్త తరం ప్రేక్షకులు కూడా ఈ కల్ట్ క్లాసిక్‌ను పెద్ద స్క్రీన్‌పై చూసే అవకాశాన్ని పొందుతున్నారు.
ఈ రీ-రిలీజ్ కేవలం జ్ఞాపకాల కోసం మాత్రమే కాదు.. 35 ఏళ్ల చిరంజీవి గౌరవాన్ని, ఆయన సినీ ప్రభావం తరతరాలకు ఎలా చేరిందో చూపించే ఒక వేడుక కూడా. మెగాస్టార్ మ్యాజిక్ ఎప్పటికీ తగ్గదని 'కోదమసింహం' మరోసారి నిరూపిస్తోంది.
Follow Us