Bunny Vas: గొడవపడి నో యూస్.. ముందు ఈ సమస్యలు పరిష్కరించాలి: బన్నీ వాస్

తెలంగాణలో నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాల మధ్య రెవెన్యూ వివాదం కొనసాగుతుండగా, బన్నీ వాస్ అసలు సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. ఎక్కువ టికెట్ ధరలు, తక్కువ ఓటీటీ విండో, హీరోల సినిమాల మధ్య గ్యాప్‌లు, మల్టీప్లెక్స్ ఖర్చులు వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారని తెలిపారు.

New Update
Bunny Vas

Bunny Vas

Bunny Vas: తెలంగాణలో ప్రస్తుతం నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాల మధ్య ఆదాయ పంపకాల విషయంలో భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. థియేటర్ యజమానులు శాతం పద్ధతిలో ఆదాయం పంచుకోవాలని కోరుతుండగా, పెద్ద నిర్మాతలు మాత్రం ఆ విధానానికి అంగీకరించడం లేదు. ఈ పరిస్థితిలో నిర్మాత బన్నీ వాస్ Bunny Vas ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ, పెద్ద సినిమాలు భారీ కలెక్షన్లు సాధిస్తున్నట్లు కనిపించినా, దానికి ప్రధాన కారణం టికెట్ ధరలు పెరగడమేనని చెప్పారు. కానీ నిజానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మాత్రం పెరగలేదని అన్నారు. ప్రస్తుతం సినిమాలు చూసేందుకు వస్తున్న కొద్దిమంది ప్రేక్షకులపైనే ఎక్కువ ఖర్చు భారం పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చిన్న సినిమాల పరిస్థితి మరింత కష్టంగా మారిందని చెప్పారు.

నిర్మాతలు మాత్రమే కాదు, థియేటర్ యాజమాన్యాలు కూడా నష్టాలను ఎదుర్కొంటున్నాయని బన్నీ వాస్ Bunny Vas తెలిపారు. ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అందులో ముఖ్యమైనది హీరోలు సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోవడమేనని అన్నారు. హీరోలు తరచుగా సినిమాలు చేయకపోతే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుందని ఆయన భావిస్తున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో హీరోల పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు.

ఇక ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాలు త్వరగా విడుదల కావడం కూడా థియేటర్లపై ప్రభావం చూపుతోందని చెప్పారు. అదనంగా, అధిక టికెట్ ధరలకు సరిపడే స్థాయి కంటెంట్ లేకపోవడం, మల్టీప్లెక్స్‌లలో స్నాక్స్, డ్రింక్స్ ధరలు చాలా ఎక్కువగా ఉండటం వంటి అంశాలు కూడా ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న ఈ సమస్యలను పరిష్కరించడంపై ఇండస్ట్రీ ముందుగా దృష్టి పెట్టాలని, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయంపై పరస్పరం గొడవపడటం వల్ల ఉపయోగం ఉండదని బన్నీ వాస్ Bunny Vas సూచించారు.

Advertisment
తాజా కథనాలు