/rtv/media/media_files/2026/02/06/peddi-poatponed-2026-02-06-10-21-42.jpg)
Peddi Postponed
Peddi Postponed: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ విడుదల వాయిదా పడింది. మొదట ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమాను కొద్దిరోజులు వాయిదా వేయాల్సి వచ్చింది.
తాజాగా చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30, 2026న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేయగా, కొద్దిసేపటికే రామ్‌చరణ్ కూడా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులకు ఈ వార్త తెలియజేశారు.
The date of his arrival changes, but not his MIGHTY GRIT ❤️🔥
— BuchiBabuSana (@BuchiBabuSana) February 4, 2026
#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026.
Mega Power Star
@AlwaysRamCharan@NimmaShivanna#JanhviKapoor@BuchiBabuSana@arrahman@RathnaveluDop@artkolla@NavinNooli@bomanirani@IamJagguBhai@divyenndu… pic.twitter.com/AayRs6zvkO
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 26న విడుదల కానుంది. నెల వ్యవధిలోనే బాబాయ్, అబ్బాయి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
#PEDDI will see you on 30th APRIL, 2026 💪🏻🔥@NimmaShivanna#JanhviKapoor@BuchiBabuSana@arrahman@vriddhicinemas@VenkataSKilaru@MythriOfficial@SukumarWritings@PeddiMovieOfflpic.twitter.com/TTfrxi773W
— Ram Charan (@AlwaysRamCharan) February 4, 2026
గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామా
‘పెద్ది’ సినిమా గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
హీరో-డైరెక్టర్ కాంబినేషన్, రామ్‌చరణ్-జాన్వీ జంటతో పాటు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో రామ్‌చరణ్ క్రికెట్ ఆడుతున్న సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
Follow Us