డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఆ కారణంతోనే ఎలిమినేట్ కానున్నారా? బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ వారం నిఖిల్, పృథ్వీ, నబీల్, హరితేజ, యష్మీ, టేస్టీ తేజ, గౌతమ్, ప్రేరణ, మణికంఠ నామినేషన్ లో ఉండగా.. హరితేజ లేదా టేస్టీ తేజ ఎలిమినేట్ కానున్నట్లు టాక్. By Archana 18 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update bigg boss 8 షేర్ చేయండి Bigg Boss Telugu 8: గత సీజన్స్ లో ఎప్పుడూ లేనట్లుగా ఒకేసారి 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 6 వారాలు పూర్తయిన ఈ షోలో బేబక్క, సీతా, ఆదిత్య ఓం, నైనికా, సోనియా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరనే చర్చ ఇప్పటికే సోషల్ మొదలైంది. ఈ వారం నిఖిల్, పృథ్వీ, నబీల్, హరితేజ, యష్మీ, టేస్టీ తేజ, గౌతమ్, ప్రేరణ, మణికంఠ నామినేషన్ లో ఉండగా.. హరితేజ, టేస్టీ తేజ పేర్లు బయటకు వెళ్లే లిస్టులో ఎక్కువగా వినిపిస్తున్నాయి. హరితేజ, టేస్టీ తేజ ఎలిమినేటెడ్..? అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆన్ లైన్ పోల్స్ ప్రకారం నబీల్, నిఖిల్, ప్రేరణ, మణికంఠ, పృథ్వీ, యష్మీ సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. హరితేజ, టేస్టీ తేజ, గౌతమ్ ముగ్గురు లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారు. ఇక ఈ ముగ్గురిలో టేస్టీ తేజ లేదా హరితేజ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇప్పటికే ఆరు వారాలుగా గేమ్ లో ఉన్న నబీల్, నిఖిల్, ప్రేరణ, మణికంఠ, పృథ్వీ, యష్మీకి ఆల్రెడీ సెట్ ఆఫ్ ఆడియన్స్ క్రియేట్ అయిపోయారు. సో వాళ్ళకు ఓటింగ్ బాగానే పడే అవకాశం ఉంది. ఇక హరితేజ, టేస్టీ తేజ, గౌతమ్ విషయానికి వస్తే.. ఈ ముగ్గురు గత సీజన్స్ లో వచ్చిన వాళ్ళే.. దీంతో వీళ్ళ పై ప్రేక్షకులు అంతగా ఆసక్తిని చూపకపోవడం కూడా వీరి ఎలిమినేషన్ కు కారణం కావచ్చని టాక్. మరి ఈ ముగ్గురిలో ప్రేక్షకులు ఊహించినట్లుగానే టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడా? లేదా ఊహించని గౌతమ్, హరితేజ ఎలిమినేట్ అవుతారా? తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. Also Read: Married Couples : కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి