గుండెపోటు కాదు.. గంగవ్వకు అసలేమైంది.. వణుకుతున్న కంటెస్టెంట్స్!

గంగవ్వ గుండెపోటు వచ్చిందనే వార్తలకు తాజాగా విడుదలైన ప్రోమోతో క్లారిటీ ఇచ్చాడు బిగ్ బాస్. అంతా ప్రాంక్ అని తేలిపోయింది. టేస్టీ తేజ, అవినాష్ ప్లాన్ చేసిన ప్రాంక్ లో భాగంగా గంగవ్వ దెయ్యం పట్టినట్టు నటించి.. మిగతా కంటెస్టెంట్స్ అందరినీ భయపెట్టింది. ఈ ప్రోమో మీరూ చూసేయండి.

New Update

అంతా ప్రాంక్.. 

కాగా, తాజాగా విడుదలైన ప్రోమోతో ఈ వార్తలన్నింటికీ  క్లారిటీ ఇచ్చాడు. ప్రోమో చూసిన తర్వాత అంతా ప్రాంక్ అని తేలిపోయింది. హౌస్ మెట్స్ ను భయపెట్టడానికి  టేస్టీ తేజ, అవినాష్ ప్లాన్ చేసిన ప్రాంక్ లో భాగంగా గంగవ్వ తనకు దెయ్యం పట్టినట్లు నటించి కంటెస్టెంట్స్ అందరినీ భయపెట్టింది. ఇదంతా ప్రాంక్ అని తెలియని మిగతా కంటెస్టెంట్ గంగవ్వను చూసి వణికిపోయారు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు 'గంగవ్వ ఆస్కార్ యాక్టింగ్', 'గంగవ్వ రాక్స్.. హౌస్ మేట్స్ షాక్స్' అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో గంగవ్వకు ఎలాంటి గుండెపోటు రాలేదు.. ఆమె బిగ్ బాస్ హౌస్ ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిపోయింది.  

ఒకప్పుడు వ్యవసాయ కూలీ అయిన గంగవ్వ.. ఇప్పుడు అతి పెద్ద సెలెబ్రెటీగా మారింది. 'మై విలేజ్ షో'  అనే ఛానెల్ లో పల్లెటూరి వీడియోలో చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. 60 ఏళ్ళ వయసులో కూడా చలాకీగా వీడియోలు చేస్తూ, గలగలా మాట్లాడే గంగవ్వ అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యింది. అదే పాపులారిటీ తో  బిగ్ బాస్ లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు