బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్.. మెహబూబ్ ఎలిమినేటెడ్! బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ వీక్ పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, మెహబూబ్, నయని పావని నామినేషన్స్ లో ఉండగా.. మెహబూబ్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు టాక్. By Archana 27 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update Bigg Boss Telugu 8 షేర్ చేయండి Bigg Boss Telugu 8: గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ కాస్త ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా ఒకేసారి 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ రావడంతో మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే 8 వారాలు పూర్తవగా.. బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, సీత, మణికంఠ ఎలిమినేట్ అయ్యారు. Also Read: అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్ ఇక ఈ వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరనే దాని పై నెట్టింట ఇప్పటికే చర్చ మొదలైంది. ఈ వీక్ పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, మెహబూబ్, నయని పావని బిగ్ బాస్ ఇంటి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. అయితే ఈ ఆరుగురిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన మెహబూబ్, నయని పావని డేంజర్ జోన్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం వీరిద్దరూ లీస్ట్ ఉన్నారు. దీంతో మెహబూబ్ లేదా నయని పావని ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఎక్కువగా మెహబూబ్ పేరు వినిపిస్తోంది. మెహబూబ్ స్ట్రాంగ్ ప్లేయర్ అయినప్పటికీ.. గత వారం రిలీజియన్ పేరుతో ఓట్లు పడతాయని మాట్లాడడం జనాల్లో అతని పై కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఇది కూడా తన ఎలిమినేషన్ కు కారణం కావచ్చని టాక్. సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వచ్చిన మెహబూబ్ 10 వారాల పాటు హౌస్ లో కొనసాగాడు. ఇది ఇలా ఉండగా.. సెప్టెంబర్ 1న ప్రసారమైన ఈ షో లాంచింగ్ ఎపిసోడ్‌కు ఏకంగా 18.9 టీఆర్పీ వచ్చింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు 16.18 టీఆర్పీ వచ్చింది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్ ప్రారంభ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చింది. Also Read: నాగ్ మామ హోస్టింగ్ మామూలుగా లేదు.. కంటెస్టెంట్స్ కుండ పగిలింది! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి