/rtv/media/media_files/2026/04/13/shanti-priya-2026-04-13-14-02-51.jpg)
Shanti Priya
Shanti Priya: శాంతిప్రియ ప్రముఖ నటి భానుప్రియ చెల్లెలుగా సినీ రంగంలోకి వచ్చారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. మహర్షి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించారు.
కెరీర్ బాగానే సాగుతున్న సమయంలో బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కూడా వరుస సినిమాలు చేశారు. తక్కువ సమయంలోనే కొన్ని సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించారు. అదే సమయంలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ రే తో ప్రేమలో పడి, 1999లో వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత ఆమె స్వచ్ఛందంగా సినిమాలకు దూరమయ్యారు. ఎవరూ బలవంతం చేయలేదని, కుటుంబ జీవితంపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే 2004లో ఆమె భర్త గుండెపోటుతో మరణించడంతో ఆమె తీవ్రంగా మానసికంగా కుంగిపోయారు. ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని చెప్పారు.
ముంబైలో ఎవరు లేక ఒంటరిగా ఉండాల్సి వచ్చిందని, ఆ సమయంలో తన తల్లి, అక్క, సోదరుడు తన పిల్లలకు అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. చెన్నైకి రావాలని కుటుంబం చెప్పినా, తాను స్వతంత్రంగా నిలబడాలని ముంబైలోనే ఉండి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లానని తెలిపారు.
కొంతకాలం తర్వాత మళ్లీ నటనపై ఆసక్తి పెంచుకుని, ధారావి బ్యాంక్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా సినిమాలు, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
Shanthi Priya, known for being Akshay Kumar’s first on-screen co-star and a 90s sensation,has embraced a bold new look. The actress recently shared a photo on Instagram,proudly flaunting her shaved head while wearing a brown blazer that belonged to her late husband,Siddharth Ray. pic.twitter.com/eapJrhhvae
— Muhammad adil (@Neelampari36089) April 12, 2025
గుండు లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మహిళలు తమకు నచ్చిన విధంగా జీవించాలని సందేశం ఇచ్చారు. అలాగే గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఫోటోలు కూడా షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
“I set myself free.” — Shanthi Priya shared on IG.
— The Better India (@thebetterindia) April 16, 2025
In a world that often ties femininity to long hair and delicate clothing, Shanthi Priya’s choice to go bald and wear a man’s blazer redefines beauty and womanhood on her own terms.#BaldAndBeautiful#ShanthiPriya… pic.twitter.com/AHEwrPl77i
ఇక తన కెరీర్‌లో వెంకటేష్ తో కలిసి నటించాలని కోరిక ఉన్నప్పటికీ అది నెరవేరలేదని చెప్పారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు.
Follow Us