/rtv/media/media_files/2026/04/02/jabardasth-komarakka-2026-04-02-11-23-44.jpg)
Jabardasth Komarakka
Jabardasth Komarakka:
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో జబర్దస్త్ ఫేమ్ కొమురక్క తన ఇంట్లో ఉండగా మంగళవారం రాత్రి దారుణమైన దాడికి గురయ్యారు. ఎనిమిది మంది యువకులు, తాము అభిమానులమంటూ, ఆమె ఇంటికి వెళ్లి కొమురక్కపై, కుటుంబ సభ్యులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, కొమురక్క ఇంట్లో కొన్ని రోజుల క్రితం బంగారం చోరీకు గురైంది. తన అసిస్టెంట్ శ్రీనాథ్‌పై అనుమానంతో ఆరా తీయగా, అతను నిజం ఒప్పుకున్నాడు. కొమురక్క బంగారం తిరిగి ఇవ్వాలని చెప్పడంతో, శ్రీనాథ్ తన స్నేహితులకు విషయాన్ని చెప్పాడు.
Also Read: గూస్ బంప్స్ తెపిస్తున్న 'రామాయణ' టీజర్..
అదే రోజు రాత్రి 11 గంటలకు వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్, గోవా శివ, రామ్‌చరణ్, నరేష్, పోతుల శివ, కిశోర్ అనే ఎనిమిది మంది కొమురక్క ఇంటికి వచ్చారు. తాము అభిమానులు అని నమ్మించిన, “మా స్నేహితుడు శ్రీనాథ్‌ను ఎందుకు తిట్టావు?” అని వాగ్వాదం మొదలు పెట్టారు.
దాడి సమయంలో కొమురక్క సోదరుడు యాదయ్య అడ్డుకోవడానికి ప్రయత్నించగా, నిందితులు తీవ్రంగా కర్రలు, రాళ్లతో కొమురక్కపై దాడి చేశారు. స్థానికుడు రామును కూడా దాడి చేసి, బెదిరించారు. గ్రామస్తులు కలసి అడ్డుకున్నప్పటికీ, నిందితులు తమ బైక్‌లను వదిలి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి, ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Follow Us