/rtv/media/media_files/2026/03/19/anushka-shetty-2026-03-19-08-14-06.jpg)
Anushka Shetty
Anushka Shetty: అనుష్క శెట్టి గురించి మరోసారి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ వార్తలపై తాజాగా ఆమె టీమ్ స్పందించింది.
అనుష్క పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అధికారిక సమాచారం లేకుండా ఇలాంటి విషయాలను ప్రచారం చేయొద్దని మీడియా, సోషల్ మీడియా పేజీలకు సూచించింది.
టీమ్ మాట్లాడుతూ, నిజాలు తెలుసుకోకుండా ఊహాగానాలు రాయడం జర్నలిజం కాదని, అది వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడమే అని తెలిపింది. ప్రతి చిన్న విషయాన్ని హెడ్లైన్స్ చేయడం సరైన పద్ధతి కాదని చెప్పింది.
మరింతగా, అనుష్క వయస్సుపై తరచూ చర్చ చేయడం కూడా తప్పని టీమ్ అభిప్రాయపడింది. ఈ విధంగా మహిళా నటీమణులపై మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఎందుకని ప్రశ్నించింది. పురుష నటుల విషయంలో ఇలా జరగడం తక్కువగా ఉంటుందని పేర్కొంది.
అనుష్క ఎప్పుడూ తన కెరీర్‌ను గౌరవంగా కొనసాగించిందని, ప్రచారం కోసం ఎలాంటి ట్రిక్స్ వాడలేదని టీమ్ తెలిపింది. ఆమె వ్యక్తిగత జీవితం ప్రైవేట్‌గా ఉంచుకోవాలని ఇష్టపడుతుందని చెప్పింది. పెళ్లి అనేది చాలా వ్యక్తిగత విషయం అని, దాన్ని సంచలనంగా చూపించడం సరికాదని పేర్కొంది.
ఈ ప్రకటనతో ప్రస్తుతం వస్తున్న పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లైంది. అలాగే బాధ్యతతో వార్తలు రాయాలని మీడియాకు గట్టి సందేశం ఇచ్చింది.
‘కథనార్’ నుంచి సర్ప్రైజ్ అప్‌డేట్..
Get ready for the Chills🥵💥#Kathanar Teaser on 31.3.26 at 13.31 PM. #AnushkaShettypic.twitter.com/KyNkFNV7Ln
— AnushkaShettyPlanet (@Sweety_ShettyFc) March 17, 2026
ఇక సినిమాల విషయానికి వస్తే, అనుష్క తన కొత్త సినిమా “కథనార్” గురించి ఒక అప్‌డేట్ ఇచ్చింది. మార్చి 31న మధ్యాహ్నం 1:31 గంటలకు ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ అప్‌డేట్ రానుందని ప్రకటించింది.
ఈ సినిమాలో మలయాళ నటుడు జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. అనుష్క హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని రోజిన్ థామస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గోకులం గోపాలన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా 9వ శతాబ్దం కాలానికి సంబంధించిన కథతో రూపొందుతోంది. మాంత్రిక శక్తులు, ఆధ్యాత్మిక అంశాలు, సస్పెన్స్ కలగలిపి థ్రిల్లర్ స్టైల్‌లో ఉంటుంది. కేరళ జానపద కథల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
Follow Us