Bhogi Anupama: పక్కా పల్లెటూరు పిల్లగా అదరకొట్టిన అనుపమ.. శర్వా “భోగి” ఫస్ట్ లుక్ రిలీజ్!

“భోగి” సినిమాలో అనుపమ పరమేశ్వరన్ సులోచన రాణిగా పల్లెటూరు పిల్ల లుక్‌లో కనిపిస్తోంది. ఆకులతో జీవనం సాగించే పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా సిద్ధమైంది. శర్వానంద్ రగ్గడ్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రం 1960ల నేపథ్యంలో సాగనుంది, ఆగస్టు 28న విడుదల కానుంది.

New Update
Bhogi Anupama

Bhogi Anupama

Bhogi Anupama: తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే శర్వానంద్(Sharwanand) ఇప్పుడు “భోగి” సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, బర్త్‌డే పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఇప్పుడు ఈ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ పాత్రను పరిచయం చేశారు. ఈ సినిమాలో ఆమె “కందుల సులోచన రాణి” అనే పల్లెటూరు యువతిగా కనిపించనుంది.

పోస్టర్‌లో అనుపమ చాలా సహజంగా కనిపిస్తోంది. తలపై మోదుగ ఆకు బుట్ట పెట్టుకుని, చేతిలో మరో ఆకు గుత్తి, అలాగే భోజనం పెట్టుకునే డబ్బాతో ఆమె కనిపించింది. హాఫ్ సారీ ధరించి, సాధారణ పల్లెటూరి అమ్మాయిలా కనిపించడం ప్రత్యేకంగా నిలిచింది. ఆమె వెనుక మట్టి ఇళ్లు, పశువులు కనిపించడం పోస్టర్ కు పల్లెటూరి లుక్  ఇచ్చాయి.

సులోచన రాణి జీవితం అంత సులభం ఏమీ కాదు. అడవిలో నుంచి ఆకులు తెచ్చుకుని వాటితో పలకలు తయారు చేసి జీవనం సాగించే పాత్ర ఇది. ఆమె ముఖంలో కనిపించే నిశ్శబ్దం, బాధ్యత ఈ పాత్రలోని లోతును తెలియజేస్తాయి.

ఈ పాత్ర కోసం అనుపమ ప్రత్యేకంగా శ్రమించింది. స్థానిక భాష, మాట్లాడే తీరు, అలవాట్లు అన్నింటినీ నేర్చుకుని నిజమైన గ్రామీణ అమ్మాయిలా కనిపించేలా సిద్ధమైంది.

ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే, మే మొదటి వారంలో హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా డింపుల్ హయాతి నటిస్తోంది.

1960ల కాలంలో తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisment
తాజా కథనాలు