/rtv/media/media_files/2026/02/06/actor-chandrahas-2026-02-06-11-47-15.jpg)
Actor Chandrahas
Actor Chandrahas: యువ నటుడు చంద్రహాస్ పై హైదరాబాద్‌లో మరో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రహాస్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Case filed on #attitudestar#chandrahas
— Anchor sharath (@AnchorSharath96) February 4, 2026
By journalist ashok #BarabarPremisthapic.twitter.com/wHl8IVIk4F
“Indake Okka Paata Paadanu…Ah Paata Kuda Ikkada Andariki Nachindi…Claps Kottaru”
— cinee worldd (@Cinee_Worldd) February 2, 2026
Cinema lo Lyrics avi undavu……Ivi Na Own Lyrics
— Attitude Star Chandrahas https://t.co/L4wWEoG8USpic.twitter.com/YxnN7Rglyo
సమాచారం ప్రకారం, ఇటీవల జరిగిన తన కొత్త సినిమా ‘బరబర్ ప్రేమిస్తా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ స్టేజ్‌పై అసభ్య పదాలతో ఉన్న పాట పాడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తప్పుబడుతూ సీనియర్ జర్నలిస్ట్ అశోక్ కుమార్ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. బహిరంగ వేదికలపై ఇలాంటి ప్రవర్తన సరికాదని ఆయన ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.
దీనికి రిప్లై గా చంద్రహాస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జర్నలిస్ట్‌ను బెదిరించేలా వీడియో పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై అశోక్ కుమార్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అక్కడ కూడా చంద్రహాస్‌పై కేసు నమోదైంది.
ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఈ ఘటనకు సంబంధించి చంద్రహాస్‌పై BNS సెక్షన్ 296తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రెండు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై విచారణ కొనసాగుతోంది.
చంద్రహాస్ ప్రముఖ టీవీ నటుడు ప్రభాకర్ కుమారుడిగా గుర్తింపు పొందారు. ఈ ఘటనలు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Follow Us