మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ స్టోరీ.. 'అమరన్' ట్రైలర్ చూశారా శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'అమరన్'. ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మీరూ చూసేయండి. By Archana 24 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update Amaran Telugu Trailer షేర్ చేయండి Amaran Telugu Trailer : కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'అమరన్'. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, అశోక చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి మేజర్ ముకుంద్ భార్య ఇంధు రెబెక్కా వర్గీస్ పాత్రలో నటించగా.. రాహుల్ బోస్ కమాండింగ్ ఆఫీసర్ పాత్రను పోషించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే 'అమరన్' ట్రైలర్' ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత సంఘటనలతో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తల్లి దండ్రులకు ఇష్టం లేకపోయిన ఆర్మీనే తన లైఫ్ గా భావించిన ముకుంద్ 44వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ లో చేరడం, ఆ క్రమంలో ఇందు రెబెకాతో ప్రేమ, పెళ్లి, పిల్లలు.. ఇలా మేజర్ ముకుంద్ జీవిత కథ అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా కనిపించింది. ట్రైలర్ లో సాయిపల్లవి, శివ కార్తికేయన్.. ఇందు, ముకుంద్ పాత్రలో జీవించేశారు. కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. Leaders seldom choose a trodden path. They create one where there is none and blaze a new trail. #MajorMukundVaradarajan of TamilNadu is one such leader. We take pride in regaling his story #AmaranTrailer Out NowTamil: https://t.co/nV2zGgXObAHindi: https://t.co/1Pv2bnZHpU… pic.twitter.com/lyFye7qX6b — Kamal Haasan (@ikamalhaasan) October 23, 2024 Also Read: ఓటీటీలో కార్తీ, అరవింద్ స్వామి ‘సత్యం సుందరం’.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి