''నాన్న నువ్వే నా హీరో''.. పుష్ప2 రిలీజ్ వేళ అయాన్ స్పెషల్ లెటర్ వైరల్!

పుష్ప2 విడుదలకు ముందు అల్లు అర్జున్ కొడుకు అయాన్ తన డాడీ కోసం స్వయంగా రాసిన స్పెషల్ నోట్ నెట్టింట వైరలవుతోంది. కొడుకు రాసిన లేఖను సోషల్ వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు అల్లు అర్జున్. 

New Update

Pushpa 2: అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఆరు భాషల్లో ఏకంగా 12వేలకు పైగా థియేటర్స్ లో మొదటి సౌత్ ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంచనాలకు తగ్గట్లే  బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దుమ్మురేపుతోంది 

డాడీ కోసం అయాన్ స్పెషల్ నోట్ 

అయితే ఈ సినిమా విడుదలకు ముందు అల్లు అర్జున్ కొడుకు అయాన్ తన డాడీ కోసం స్వయంగా రాసిన స్పెషల్ నోట్ నెట్టింట వైరలవుతోంది. కొడుకు రాసిన లేఖను సోషల్ వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు అల్లు అర్జున్. 

నాన్నకు మొదటి అభిమానిని నేనే.. 

అయాన్ లేఖలో ఇలా రాశాడు.. "ప్రియమైన నాన్న.. మీ విజయం, కృషి, అభిరుచి, అంకితభావం గురించి నేను ఎంతగా గర్వపడుతున్నానో చెప్పడానికి ఈ నోట్ రాస్తున్నాను. నిన్ను నెంబర్ 1 స్థానంలో చూసినప్పుడు.. నేను ఈ  ప్రపంచంలోనే   అగ్రస్థానంలో ఉన్నట్లు అనిపిస్తుంది.  ఈరోజు ఒక గొప్ప నటుడి సినిమా వస్తున్నందున ఇదొక ప్రత్యేకమైన రోజు. పుష్ప కేవలం సినిమా మాత్రమే కాదు.. నటనపై మీ అభిరుచి, ప్రేమకు ప్రతిభింభం. ఫలితం ఏమైనప్పటికీ మీరు ఎల్లప్పుడూ నా హీరో, నా స్ఫూర్తి. ఈ దేశంలో మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు.. అందులో నేను మీ నెంబర్  1 అభిమానిని. గర్వించదగిన కొడుకు తన మొదటి హీరోకు రాస్తున్న గమనిక" అంటూ అల్లు అర్జున్ కోసం స్పెషల్ నోట్ రాశాడు అయాన్. 

Also Read: Pawan Kalyan: మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. పవన్ నిర్ణయంతో అంతా అయోమయం?

Screenshot 2024-12-05 091205

నా అతి పెద్ద విజయం

ఈ లేఖను చదివిన బన్నీ ఎమోషనల్ అయ్యారు. దీనిని తన సోషల్ వేదికగా షేర్ చేస్తూ.. నా కొడుకు అయాన్ ప్రేమ నా హృదయాన్ని తాకింది. ఇప్పటివరకు ఇదే నా అతి పెద్ద విజయం. అలాంటి ప్రేమ లభించడం నా అదృష్టం.  

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు