/rtv/media/media_files/2026/03/19/allu-arjun-dhurandhar-2-2026-03-19-11-16-17.jpg)
Allu Arjun Dhurandhar 2
Allu Arjun Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కలయికలో వచ్చిన సినిమా ‘ధురంధర్ 2: ది రివెంజ్’ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. సినిమా విడుదలకు ఒక రోజు ముందే నిర్వహించిన పెయిడ్ ప్రివ్యూలు ప్రేక్షకులను, సినీ ప్రముఖులను ఆశ్చర్యపరిచాయి.
అల్లు అర్జున్ సూపర్ రియాక్షన్
పెయిడ్ ప్రివ్యూలో సినిమా చూసిన ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ సోషల్ మీడియా (X) ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ,
సినిమా బ్లాక్ బస్టర్ అనిపించిందని, రణ్‌వీర్ సింగ్ నటన గొప్పగా ఉంది, ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంటుందని, ఆర్.మాధవన్ నటన అద్భుతంగా ఉందని, దర్శకుడు ఆదిత్య ధర్ భారతీయ కథను అంతర్జాతీయ స్వాగ్‌తో చూపినందుకు ప్రశంసలు తెలిపారు.
Just Watched #Dhurandhar2⁰Patriotism with swag 🇮🇳
— Allu Arjun (@alluarjun) March 18, 2026
A film that will make every patriot proud 🇮🇳⁰Many clap-trapping moments 👏🏽
BLAST! 💥
Congratulations to the entire team.⁰Fine performances by @ActorMadhavan garu & all actors . Technical brilliance .
So proud to have a…
అల్లు అర్జున్ ప్రత్యేకంగా రణ్‌వీర్ సింగ్‌ను “బ్రిలియంట్, వెర్సటైల్ నటుడు”గా అభివర్ణించారు. దర్శకుడికి, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
పెయిడ్ ప్రివ్యూలు బాక్సాఫీస్ వసూళ్లలో రికార్డు
గతేడాది విడుదలైన ధురంధర్ సీక్వెల్ పెద్ద హిట్ కావడంతో, ఈ సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, కేవలం పెయిడ్ ప్రివ్యూల ద్వారా రూ.44 కోట్లు వసూలు చేయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులు, ఫ్యాన్స్, పరిశ్రమలోని ప్రముఖులు ఈ సినిమా పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమా హైప్‌ను మరింత పెంచాయి. ఈ సీక్వెల్ బిగ్గెస్ట్ సూపర్ హిట్ గా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
‘ధురంధర్ 2’ రణ్‌వీర్ సింగ్ పెర్ఫార్మన్స్, ఆదిత్య ధర్ దర్శకత్వం, పాట్రోయిటిక్ థీమ్, బాక్సాఫీస్ రికార్డులను కలిపి ఏప్రిల్ 2026లో ప్రేక్షకులకు మాస్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుంది.
Follow Us